టీడీపీ 40 వసంతాల హంగామా …చంద్రబాబు మళ్ళీ సీఎం కావాలంటున్న సినీ ప్రముఖులు!
-హైదరాబాద్‌లో చంద్రబాబు, మంగళగిరిలో లోకేశ్.. టీడీపీ 40 వసంతాల వేడుక ప్రారంభం
-ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో చంద్రబాబు
-ఎన్టీఆర్ పార్టీని ప్రకటించిన ప్రాంతంలోనే వేడుకలకు శ్రీకారం
-చంద్రబాబు వెంట అచ్చెన్న, బక్కని
-మంగళగిరిలో బైక్ ర్యాలీలో నారా లోకేశ్
టీడీపీ పార్టీ 40 వసంతాలు పూర్తీ చేసుకున్న సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఘనంగా వేడుకలు నిర్వహింస్తున్నారు. దీంతో ఆపార్టీ శ్రేణులన్నీ ఒక్కసారిగా బిజీ అయ్యాయి. ఈ సందర్భంగా అనేకమంది సినీ ప్రముఖులు అశ్వని దత్ , రాఘవేందర్ రావు లు తిరిగి చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. చాలాకాలంగా స్తబ్దతగా ఉన్న హైద్రాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అనేకమంది ప్రముఖుల రాక అలంకారాలతో కళకళలాడింది.
పార్టీ (టీడీపీ) 40 వసంతాల వేడుకలు మంగళవారం సాయంత్రం 4గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నాడు ఎన్టీఆర్ పార్టీ పేరును ప్రకటించిన చోటుకు వెళ్లిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. చంద్రబాబు వెంట రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, బక్కని నర్సింహులుతో పాటు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలివెళ్లాయి.
ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరిలో పార్టీ 40 ఏళ్ల పండుగ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు నిర్వహించిన బైక్ ర్యాలీలో లోకేశ్ ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఇదిలా ఉంటే.. టీడీపీ40 వసంతాల వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా జరుపుకుంటున్నాయి.