Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రెండు రోజులే ఛాన్స్‌.. ఛ‌లాన్ల క్లియ‌రెన్స్‌కు గ‌డువు పెంపు లేద‌ట‌!

రెండు రోజులే ఛాన్స్‌.. ఛ‌లాన్ల క్లియ‌రెన్స్‌కు గ‌డువు పెంపు లేద‌ట‌!

  • 2 రోజుల్లో ముగియ‌నున్న‌ రాయితీతో ఛ‌లాన్ల క్లియ‌రెన్స్
  • గ‌డువు పెంపు లేదంటూ తెలంగాణ పోలీస్ శాఖ ప్ర‌క‌ట‌న‌
  • ఛ‌లాన్లు క్లియ‌ర్ కాకుండా గ‌డువు తీరాక చ‌ర్య‌లేన‌ని హెచ్చ‌రిక‌

తెలంగాణ‌లో వాహ‌నాల పెండింగ్ ఛ‌లాన్ల క్లియ‌రెన్స్‌కు రాయితీ మ‌రో రెండు రోజులు మాత్ర‌మే అమ‌లు కానుంది. రాయితీతో ఛలాన్ల క్లియ‌రెన్స్ ఈ నెల 1న మొద‌లు కాగా.. మ‌రో రెండు రోజుల్లో అంటే ఈ నెలాఖ‌రు మార్చి 31తో ముగియ‌నుంది. ఈ గ‌డువును మ‌రింత కాలం పాటు పొడిగించే అవ‌కాశం లేద‌ని తెలిపిన తెలంగాణ పోలీసు శాఖ..గ‌డువు దాటినా ఇంకా పెండింగ్‌లోనే ఛ‌లాన్లు ఉంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది.ఈ మేర‌కు మంగ‌ళ‌వారం నాడు తెలంగాణ పోలీసు శాఖ నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.

ఇదిలా ఉంటే.. భారీ రాయితీతో కూడిన పెండింగ్ ఛ‌లాన్ల క్లియ‌రెన్స్‌కు భారీ స్పంద‌నే ల‌భించింది. మంగ‌ళ‌వారం నాటికి 2.50లక్షల పెండింగ్ చలాన్‌లను వాహనదారులు క్లియర్ చేసుకున్నారు. 800 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ అయినట్లు పోలస్‌ శాఖ తెలిపింది. చలాన్ల క్లియరెన్స్ తో రూ.240 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్లు పోలీస్‌ శాఖ పేర్కొంది. ఇప్పటికీ ఛ‌లాన్‌లు క్లియర్‌ చేయని వారు మిగిలిన 2 రోజుల్లో క్లియర్‌ చేసుకోవాలని సూచించింది.

రాయితీతో పెండింగ్ ఛ‌లాన్ల‌ను క్లియ‌ర్ చేసుకోవాలంటూ గ‌త నెల సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన తెలంగాణ పోలీసు శాఖ బైకులు 25 శాతం చెల్లిస్తే సరిపోతుందని.. 75% చలాన్‌ అమౌంట్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపిన సంగ‌తి తెలిసిందే. కార్లు, లైట్ మోటార్ వెహికల్స్‌‌కు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, తోపుడు బండ్లకి 80 శాతం రాయితీ కల్పించిన సంగ‌తి తెలిసిందే.

Related posts

కరోనా నిబంధనల మధ్య భధ్రాద్రి రాముని కళ్యాణం..

Drukpadam

హైదరాబాద్ క్రికెట్ సంఘం కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు!

Drukpadam

హైదరాబాద్ ట్రాఫిక్ జంక్షన్ ల వద్ద భారీ మార్పులు తీసుకొస్తున్న అధికారులు!

Drukpadam

Leave a Comment