Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా షాక్.. హైదరాబాద్‌లో యువకుడి మృతి!

చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా షాక్.. హైదరాబాద్‌లో యువకుడి మృతి!

  • రెండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చిన అసోం యువకుడు
  • ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీవనం
  • షాక్ కొట్టడంతో కాలిపోయిన చేతులు, చెవులు

మొబైల్ ఫోన్లకు చార్జింగ్ పెట్టి మాట్లాడడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నా, అలా పెట్టి మాట్లాడుతుండగా ప్రమాదాలు జరిగిన ఘటనలు వెలుగులోకి వచ్చినా జనం నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. ఫలితంగా ఉత్తపుణ్యానికి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్‌ శివారులోని శంకరపల్లిలో ఇలాంటి ఘటనే జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. అసోంకు చెందిన భాస్కర్ జ్యోతినాథ్ (20) రెండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ శంకర్‌పల్లిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి విధుల నుంచి వచ్చిన తర్వాత అర్ధరాత్రి వేళ ఫోన్‌కు చార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ఒక్కసారిగా షాక్ కొట్టింది. దీంతో చేతులు, చెవులు కాలిపోయాయి. వెంటనే స్నేహితులు అతడిని శంకర్‌ప్లలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ఫుడింగ్ మింక్ పబ్ కేసును తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు…

Drukpadam

హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ!

Drukpadam

ఢిల్లీలోని ట్విట్టర్ కార్యాలయాలపై పోలీసుల దాడి: ట్విట్టర్ స్పందన!

Drukpadam

Leave a Comment