Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీ కి సవాల్ గా మారనున్న రాష్ట్రపతి ఎన్నిక…

బీజేపీ కి సవాల్ గా మారనున్న రాష్ట్రపతి ఎన్నిక…
-వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ,బిజూ జనతాదళ్ పార్టీల మద్దతు అనివార్యం
-బీజేపీయేతర పార్టీలు అన్ని ఏకమైతే బీజేపీకి ఇబ్బందులే
-అదిజరుగుతుందా ? ప్రతిపక్షాలు ఏకమౌతాయా?
-2017 లో బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చిన టీఆర్ యస్ ఇప్పుడు ఇవ్వకపోవచ్చు

జూలై నెలలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఆగస్టులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం పూర్తి కానుంది. ఇద్దరి నేతల గడువు ముగింపుకు ముందే నూతన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించాలి. రాజ్యాంగపరంగా రెండు అత్యున్నత పదవుల ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రధానంగా రాష్ట్రపతి ఎన్నిక ఎన్డీయే కూటమికి.. ప్రతిపక్షాలకు బలపరీక్షగా మారే ఛాన్స్ ఉంది. ఉపరాష్ట్రపతిగా తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కేంద్ర సర్కార్‌కు ఏలాంటి ఇబ్బంది ఉండక పోవచ్చు . రాజ్యసభ, లోక్‌సభలో బీజేపీకి తగినంత బలం ఉంది. బీజేపీకి రాష్ట్రపతి అభ్యర్థి గెలుపు అంత సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా భాగస్వాములు కానున్నారు.

ప్రత్యేక ఎలక్టోరల్ కాలేజీలో రాష్ట్రపతిని ఎన్నుకొనున్నారు. ఈ ఎన్నికలో రాజ్యసభ, లోక్‌సభకు ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభల సభ్యుల ఓటు విలువ సమానంగా 708 ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీల ఓట్లకు వేర్వేరు విలువ ఉంటుంది. ఒక రాష్ట్రానికి.. మరో రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల మధ్య ఓటు విలువలోనూ తేడాలు ఉంటాయి. ఆ రాష్ట్రాల జనాభా.. ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఓటు విలువ మారుతోంది. రాష్ట్ర జనాభా అధికంగా ఉంటే ఓటు విలువ ఎక్కువగా ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజీ వేసిన మొత్తం ఓట్ల విలువ లెక్కించి ఎవరికి అధిక ఓట్లు వస్తే ఆ అభ్యర్థి విజయం సాధించినట్టుగా వెల్లడిస్తారు.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు ఉన్న ఎమ్మెల్యేల బలం కంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, బీజేపీని విభేధించే ప్రాంతీయ పార్టీలకు ఎమ్మెల్యేల బలం ఎక్కువగా ఉంది. రాష్ట్రపతి ఎలక్టోరల్‌లో బీజేపీ, వ్యతిరేక పార్టీలు ఒక తాటిపైకి వచ్చి ఉమ్మడి వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిపితే విజయం సాధించే ఛాన్స్ ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రాష్ట్రపతి ఎన్నికకు బీజేపీకి తగినంత బలం ఉంది. ఈ ఎన్నికల్లో ఓవరాల్‌గా బీజేపీకి 100కు పైగా స్థానాలను కోల్పోవడంతో ఎమ్మెల్యేల సంఖ్య బలం తగ్గింది. ఒక్క ఉత్తరప్రదేశ్‌లో 80 మంది ఎమ్మెల్యేలు తగ్గిపోవడంతో ఓటు విలువ పరంగా కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయింది.

తెలంగాణలో టీఆర్ఎస్, మహారాష్ట్రలో శివసేన, వెస్ట్ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, పంజాబ్, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ కేంద్ర సర్కార్‌ను విభేదిస్తున్నాయి. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు యూపీఏ బరిలో నిలిపే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలుపుతాయా..? లేక బీజేపీ విభేదించే పార్టీలు కూటమిగా ఏర్పడి ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలుపుతాయానేది తేలాల్సి ఉంది. యూపీఏ బరిలో నిలిపే రాష్ట్రపతి అభ్యర్థికి.. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు మద్దతు ఇస్తే రాష్ట్రపతి ఎన్నిక రసవత్తరంగా కొనసాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికలో ఓట్ల కౌంటింగ్ సాధారణ ఓట్ల కౌంటింగ్‌లా ఉండదు. ప్రత్యక్ష ఓటు బదిలీ సిస్టమ్ ఉంటుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చే ప్రాధాన్యతను బట్టి అభ్యర్థుల గెలుపోటములు మారనున్నాయి.

బీజేపీ బరిలో నిలిపిన రాష్ట్రపతి అభ్యర్థి నేరుగా గెలువలంటే అందుకు రెండు ప్రాంత్రీయ పార్టీల మద్దతు కావాలి. ఒడిశాలోని బిజూ జనతాదళ్, ఏపీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ముఖ్యం కానున్నది. 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్ పార్టీలు బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చాయి. ఈ రెండు పార్టీలతో పాటు 2017 ఎన్నికలో బీజేపీ బరిలో నిలిపిన రాష్ట్రపతి అభ్యర్థికి తెలంగాణ రాష్ట్ర సమితి కూడా మద్దతు ఇచ్చింది. ఇటీవల కాలంలో కేంద్ర సర్కార్, తెలంగాణ సర్కార్ మధ్య వైరం నడుస్తుడడంతో రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠగా మారింది.

Related posts

సరుకులపై జీఎస్టీ విధింపును తీవ్రంగా తప్పుపట్టిన కాంగ్రెస్!

Drukpadam

పోతిరెడ్డిపాడు లిఫ్ట్ పై చంద్రబాబు వైఖరేంటో స్పష్టం చేయాలి: సజ్జల…

Drukpadam

సిబిఐ విచారణకు నేను సిద్ధం నీవు సిద్దమేనా :హరీశ్ రావుకు సవాల్ విసిరిన ఈటల!

Drukpadam

Leave a Comment