భట్టి పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్… ఢిల్లీలో రాహుల్ తో సమావేశం!
-ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ నుంచి అర్జెంట్ లేఖ
-హుటాహుటిన ఢిల్లీకి …సోమవారం రాహుల్ తో సమావేశం
-ఢిల్లీ నుంచి నేరుగా తిరిగి బోనకల్లు కు
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధిర నియోజకర్గంలో చేపట్టిన పాదయాత్ర తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ అత్యవసర సమావేశంను ఏర్పాటు చేసినందున వెంటనే ఢిల్లీకి రావాలని ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ నుంచి వర్తమానం అందింది. దీంతో భట్టి తన పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. నేటి సాయంత్రం ఆయన హైద్రాబాద్ చేరుకొని అక్కడనుంచి ఆదివారం ఢిల్లీకి వెళతారు . సోమవారం అక్కడ సమావేశంలో పాల్గొని తిరిగి మంగళ, బుధవారాలలో తిరిగి రాష్ట్రానికి చేరుకొని పాదయాత్ర కొనసాగిస్తారని భట్టి కార్యాలయం తెలిపింది.
ప్రజాసమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఆదివారం నుంచి తాత్కాలికంగా వాయిదా వేశారు. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ తో ఈ నెల 4న అత్యవసర సమావేశం ఉన్నందున ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ నుంచి లేఖ రావడంతో భట్టి విక్రమార్క తన పాదయాత్రను వాయిదా వేసుకొని ఢిల్లీ బయలుదేరనున్నారు. ఈ కారణంగా బోనకల్లు మండలంలో నిర్వహించే పాదయాత్రను ఆదివారం నుంచి వాయిదా వేశారు. ఏఐసిసి అధిష్టానంతో సమావేశం ముగించుకున్న తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా బోనకల్ కు చేరుకొని సీఎల్పీ నేత తన పాదయాత్రను కొనసాగిస్తారు.