Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాడిస‌న్ హోట‌ల్ లైసెన్స్ ర‌ద్దు.. ప‌బ్‌, లిక్క‌ర్ లైసెన్సులు కూడా!

రాడిస‌న్ హోట‌ల్ లైసెన్స్ ర‌ద్దు.. ప‌బ్‌, లిక్క‌ర్ లైసెన్సులు కూడా!

  • బంజారా హిల్స్ ప‌రిధిలో ర్యాడిస‌న్ హోట‌ల్‌
  • ఈ హోట‌ల్ పై అంత‌స్తులోనే డ్ర‌గ్స్ ల‌భించిన ప‌బ్‌
  • ఈ కార‌ణంగానే హోట‌ల్ లైసెన్స్ ఇత‌ర‌త్రా అనుమ‌తుల ర‌ద్దు

బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని పబ్‌లో డ్ర‌గ్స్ ల‌భించిన కేసులో తెలంగాణ స‌ర్కారు కాసేప‌టి క్రితం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పోలీసులు దాడి చేసిన ప‌బ్ ఉన్న‌, ర్యాడిస‌న్ హోట‌ల్ లైసెన్స్‌ను ర‌ద్దు చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

బంజారా హిల్స్ ప‌రిధిలో ఏళ్ల త‌ర‌బ‌డి కార్య‌క‌లాపాలు సాగిస్తున్న ర్యాడిస‌న్ హోట‌ల్ పై అంత‌స్తులోనే డ్ర‌గ్స్ ల‌భించిన ప‌బ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌బ్‌పై పోలీసుల దాడి, కేసులో ప‌లువురు ప్ర‌ముఖుల బంధువుల పేర్లు ఒక్క‌టొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్న నేప‌థ్యంలో తెలంగాణ స‌ర్కారు కాసేపటి క్రితం ర్యాడిస‌న్ హోట‌ల్ లైసెన్స్‌ను ర‌ద్దు చేసింది. అంతేకాకుండా ఆ హోట‌ల్‌కు ఇచ్చిన ప‌బ్‌, లిక్క‌ర్ లైసెన్స్‌ల‌ను కూడా ర‌ద్దు చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

Related posts

పిల్లలు 7 గంటలకే స్కూల్ కు వెళుతున్నప్పుడు…కోర్ట్ 9 గంటలకు ఎందుకు ప్రారంభం కాకూడదు!

Drukpadam

స్మిత సబర్వాల్ వంటి వ్యక్తికే భద్రతలేదు …కేసీఆర్ పాలనలో మోసం దగా …రేవంత్ రెడ్డి …

Drukpadam

విచారణకు రావాలంటూ… హీరోయిన్ ఐశ్వర్యారాయ్‌కి ఈడీ స‌మ‌న్లు!

Drukpadam

Leave a Comment