Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంపై రాజీలేని పోరాటం : ఎంపీ నామా

వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంపై రాజీలేని పోరాటం : ఎంపీ నామా
వన్‌ నేషన్‌-వన్ ప్రొక్యూర్‌మెంట్ విధానం అమలు చేయాలి
దశలవారీ పోరాటానికి పిలుపు నిచ్చిన కేటీఆర్
రాష్ట్రంలో రోడ్ల దిగ్బంధనం …భారీగా ట్రాఫిక్ జామ్
పార్లమెంట్ లో వాక్ అవుట్ …కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు
ధాన్యం సేక‌ర‌ణలో బీజేపీ ద్వంద విధానంపై పార్ల‌మెంట్‌లో టీఆర్ఎస్ దంగ‌ల్

వడ్ల కొనుగోలు విషయంలో టీఆర్ యస్ రాజీలేని పోరాటం చేస్తుందని లోకసభలో టీఆర్ యస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు . ధాన్యం కొనుగోలుపై టీఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు దశలవారీ ఆందోళనలో భాగంగా నేడు రాష్ట్రంలో జాతీయరహదారుల దిగ్బంధనం జరిగింది. దీంతో హైవే లన్ని ట్రాఫిక్ జామ్ అయ్యాయి. అటు పార్లమెంట్ లో నామా కేంద్ర విధానాలపై ధ్వజమెత్తారు . రాష్ట్రానికి ఒక నీతి అమలు చేస్తున్న కేంద్రం విధానాలను ఆయన తప్పుపట్టారు . వన్‌ నేషన్‌-వన్ ప్రొక్యూర్‌మెంట్ విధానం కోసం కేంద్రంపై ఎటువంటి పోరాటానికైనా త‌గ్గేదేలే అని స్ప‌ష్టం చేశారు. నామ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కేంద్రంపై ఉద్య‌మాన్ని తీవ్రత‌రం చేశారు.పంజాబ్‌ తరహాలో తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయకపోతే రైతులే బీజేపీకి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

టీఆర్ఎస్ ఎంపీలు గత కొద్ది రోజులుగా లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో పెద్ద ఎత్తున ఆందోళ‌న చేయటం తో పాటుగా ఎంపీలు ధాన్యం కొనుగోలు పై వాయిదా తీర్మానం నోటీసులు, వాకౌట్‌, గాంధీ విగ్ర‌హం ముందు ఆందోళ‌న చేస్తూ కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. సీఎం కేసీఆర్‌, టీఆ‌ర్‌‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసి‌డెంట్‌, రాష్ట్ర‌ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పట్టువ‌ద‌ల‌కుండా తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీలు ఢిల్లీలో ఉభయ సభల్లో పోరాటం చేస్తున్నారు.

అందులో భాగంగా బుధవారం లోక్‌స‌భ స్పీకర్ ఓంబిర్లాకు మరోమారు ధాన్యం సేక‌ర‌ణపై వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చిన టీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు ఈ విష‌యంపై స‌భలో ఖ‌చ్చితంగా చ‌ర్చ జ‌ర‌పాల‌ని డిమాండ్ చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ… రాష్ట్రంలో త‌మ రైతాంగం ఆరుగాలం క‌ష్ట‌ప‌డి పండించిన పంట కేంద్ర ప్రభుత్వ ఆహార సంస్థ ఎఫ్ సీఐ సేకరణ చేయకపోవడంతో అన్న‌దాత‌లు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్న విష‌యంపై కేంద్రం ఆలోచ‌న చేయాల‌ని అన్నారు. కానీ, దుర‌దృష్ట‌వ‌శాత్తూ కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు. దేశంలో ఆహార ధాన్యాల సేకరణపై కేంద్ర ప్ర‌భుత్వం ఒక స్ప‌ష్ట‌మైన జాతీయ విధానం అవ‌లంభించాల‌ని ఈ విషయంపై లోక్‌సభలో చర్చించాలని పట్టుబట్టారు.

ఎంపీ నామ నేతృత్వం లో ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభలో ఆందోళన చేసారు. కేంద్రం యొక్క మొండి వైఖరికి నిరసనగా సభ నుండి టిఆర్ఏస్ ఎంపీలు వాకౌట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు నిర‌స‌న తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వ ద్వంద విధానానికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ రైతాంగం పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తుందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్ర సర్కార్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంద‌ని వివ‌రించారు.

Related posts

బీజేపీ మత రాజకీయాలపై మండిపడ్డ కేటీఆర్ …

Drukpadam

కాంగ్రెస్ పార్టీకో నమస్కారం … ప్రశాంత్ కిషోర్ సంచలనం ….

Drukpadam

ప్రతి కుటుంబానికి తక్షణసహాయంగా 2 వేలు సీఎం జగన్ ఆదేశం ….

Drukpadam

Leave a Comment