Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

ముంబై ఇండియన్స్ జట్టు ఓటమి… విజయవంతంగా మూడవసారి !

ముంబై ఇండియన్స్ జట్టు ఓటమి… విజయవంతంగా మూడవసారి !
హిట్టర్ రోహిత్ శర్మ …అరవీర బయంకరుడుడు పోలార్డ్
ఎక్కువడబ్బులు ఇచ్చి కొన్న ఇషాంత్ కిషన్
అట్టిపెట్టుకున్న సూర్యకుమారి యాదవ్
బౌలర్లలోనే మేటి జస్ప్రీత్ బుమ్రా
అందరు ముంబై ఇండియన్స్ సభ్యులే …

టైటిల్ ఫేవరేట్ అనుకున్న జట్టు ఇప్పుడు చిట్టచివర స్థానంలో ఉండనే విమర్శలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ అంటే మిగతా జట్లు అన్ని ఒక అంచనాతో ఉంటాయి. కానీ 2022 ఐపీఎల్ లో జట్టుకూర్పు పైనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ లలో మూడింటిలో ఓటమిని మూటగట్టుకున్న జట్టుగా గణతికెక్కింది. వరస ఓటములతో నవ్వులపాలు అవుతుంది. అయితే స్కోర్ మాత్రం పర్వాలేదు అనే విధంగా చేస్తుంది. కానీ చివరకు చతికలపడుతుంది. ఎందుకో స్టార్టింగ్ ట్రబుల్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మొదటి 6 ఓవర్లలో వికెట్ కాపాడుకుంటూ స్కోర్ బోర్డు పరుగెత్తించాలి కానీ టెస్ట్ మ్యాచ్ ఆడిన చందంగా బాల్స్ ను వేస్ట్ చేయడం ఒకటి అరా పరుగు తీయడంతో సరిపుచ్చుకుంటున్నారు. దీంతో జట్టు ఎదుటివారికి సులభమైన లక్ష్యం నిర్దేశించడంతో వాళ్ళు చాల సులభంగా టార్గెట్ రీచ్ అవుతున్నారు . ఇదే విధంగా కొనసాగితే ముంబై ఇండియన్స్ ను ఎవరు కాపాడలేరని క్రీడాపండితులు అంటున్నారు . నిన్న కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కనీసం 100 చేరుకుంటుంది అన్నట్లుగా ఉంది ముంబై ఇండియన్ బ్యాటింగ్ చివరకు సూర్యకుమార్ యాదవ్ , తిలక్ వర్మ, పోలార్డ్ మెరుపులతో 161 పరుగులు చేయగలిగింది .

మైదానంలో కమిన్స్ సునామీ..

గత రాత్రి పూణెలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నాలుగు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ (36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52 పరుగులు) అర్ధ శతకంతో రాణించగా.. తిలక్‌ వర్మ (27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్‌), పొలార్డ్‌ (5 బంతుల్లో 3 సిక్సర్లతో 22 నాటౌట్‌) మెరుపులు మెరిపించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (3), ఇషాన్ కిషన్ (14), డెవాల్డ్ బ్రేవిస్ (29) పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో కమిన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 162 పరుగుల ఓ మాదిరి లక్ష్య ఛేదనలో కోల్‌కతా తొలుత కొంత తడబడినప్పటికీ ఆ తర్వాత కుదురుకుంది. కమిన్స్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 15 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. దీంతో 16 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వెంకటేష్‌ అయ్యర్‌ (41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50 నాటౌట్‌) సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ముంబై బౌలర్లలో మురుగన్‌ అశ్విన్‌, మిల్స్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడిన కమిన్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

Related posts

ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర సామ్ కరన్ కు 18 .50 కోట్లు

Drukpadam

జట్టులో చోటు కోసం పోటీ తీవ్రంగా ఉంది: శ్రేయాస్ అయ్యర్

Drukpadam

మూడో టెస్టులో టీమిండియా నిర్ణయాలపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన గవాస్కర్!

Drukpadam

Leave a Comment