Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మహబూబాబాద్ లో భగ్గుమన్న టీఆర్ యస్ వర్గ విబేదాలు…

మహబూబాబాద్ లో భగ్గుమన్న టీఆర్ యస్ వర్గ విబేదాలు
మ‌హిళా ఎంపీ చేతిలోని మైక్‌ను లాగేసుకున్న ఎమ్మెల్యే
వడ్లు కొనుగోలు పై కేంద్ర వైఖరికి నిరసనగా చేపట్టిన కార్య‌క్ర‌మం
ప్ర‌సంగించేందుకు సిద్ధ‌ప‌డ్డ మ‌హిళా ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు
దురుసుగా వ‌చ్చి మైకు లాక్కున్న ఎమ్మెల్యే
మంత్రి స‌మ‌క్షంలోనే జ‌రిగిన ఘ‌ట‌న‌

వడ్ల కొనుగోలుపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ టీఆర్ యస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు జరిగాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. టీఆర్ యస్ జిల్లా అధ్యక్షురాలు , ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతుండగా ఆమె చేతిలో మైక్ ను మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ లాక్కోవడంతో ఆమె బిత్తర పోయింది. తాను మాట్లాడాలని గట్టిగా ఆమెతో వాదులాడుతూ చేసిన ఈ చర్యతో అక్కడ ఉన్న వారంతా అవాక్కు అయ్యారు . పక్కనే మంత్రి సత్యవతి రాథోడ్ , మరోపక్క ఎంపీ తండ్రి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ , ఎమ్మెల్సీ రవీందర్ రావు ఉన్నారు . ఈ హఠాత్ పరిణామం తో ఆమె చేసేది లేక కూర్చొని కన్నీరు పెట్టడం పలువురిని కలవర పరిచింది. ఎమ్మెల్యే గతంలో కూడా తన దుందుడుకు చర్యలతో చివాట్లు తిన్న మార్పు రాలేదని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

ఆయా జిల్లాల్లో పెద్ద ఎత్తున టీఆర్ యస్ శ్రేణులు తరలి వచ్చాయి. మంత్రులు ,ఎంపీలు , ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లు జడ్పీ చైర్మన్లు , డీసీసీబీ,డీసీఎంస్ చైర్మన్లు , మేయర్లు ,మున్సిపల్ చైర్మన్లు , ఎంపీపీ లు , జడ్పీటీసీ లు కార్పొరేషన్ చైర్మన్లు , పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వ పాలసీపై దుమ్మెత్తి పోశారు .

మ‌హ‌బూబాబాద్ జిల్లా శాఖ‌లో విభేదాలు పై అధిష్టానం ఆరాతీసింది. . మ‌హ‌బూబాబాద్ ఎంపీ మాలోత్ క‌విత, మ‌హ‌బూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంక‌ర్ నాయ‌క్‌ల మ‌ధ్య త‌లెత్తిన ఈ విభేదాలు గురువారం నాటి ఓ కార్య‌క్ర‌మంలో బ‌ట్ట‌బ‌య‌ల‌య్యాయి. ఓ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకున్న ఈ ఇద్ద‌రు నేత‌లు త‌మ మ‌ధ్య విభేదాల‌ను బ‌హిర్గతం చేసుకున్నారు.

మ‌హ‌బూబాబాద్‌లో నిర్వ‌హించిన నిరసన కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించేందుకు సిద్ధ‌ప‌డిన మాలోత్ క‌విత‌… చేతిలో మైక్ ప‌ట్టుకుని నిల‌బ‌డ‌గా… అక్క‌డికి దురుసుగా వచ్చిన శంక‌ర్ నాయ‌క్ ఆమె చేతిలోని మైక్‌ను లాగేసుకున్నారు. అంత‌టితో ఆగ‌ని ఆయ‌న.. ఎంపీ వెనుక ఎత్తుగా ఉన్న వేదిక‌ను ఎక్కి ప్ర‌సంగించారు. ఈ త‌తంగం మంత్రి సత్య‌వ‌తి రాథోడ్ స‌మ‌క్షంలోనే జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.
ఎంపీ కవిత కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నారు . అక్కడ కు వచ్చిన శంకర్ నాయక్ అనుయాయులు శంకర్ నాయక్ జిందాబాద్ అంటూ నినాదాలు కూడా ఇచ్చారు . శంకర్ నాయక్ చర్యలను సొంత పార్టీ వారే తప్పు పట్టడం గమనార్హం .

Related posts

ఢిల్లీ లో ఈటల … కాషాయ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం…

Drukpadam

కాంగ్రెస్ కు కొండా విశ్వేశ్వర రెడ్డి గుడ్ బై …?

Drukpadam

తిరిగి బీఆర్ యస్ గూటికి చేరిన బొమ్మెర రామ్మూర్తి!

Drukpadam

Leave a Comment