Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ యస్ ఖమ్మం జిల్లా నిరసనలో కనిపించని మాజీలు! Hi

టీఆర్ యస్ ఖమ్మం జిల్లా నిరసనలో కనిపించని మాజీలు!
హాజరైన మంత్రి , ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీ ,
జడ్పీ ,డీసీసీబీ , డీసీఎంస్ ,మేయర్ , సుడా చైర్మన్లు
కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించిన నేతలు

టీఆర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు జరిగిన నిరసన కార్యక్రమం లో భాగంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన నిరసనలో మాజీలు కనిపించలేదు . మంత్రి పువ్వాడ అజయ్ , ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షడు తాతా మధు , సత్తుపల్లి , పాలేరు , వైరా , ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య , కందాల ఉపేందర్ రెడ్డి , లావుడ్య రాములు నాయక్ లు , జడ్పీ, డీసీసీబీ , డీసీఎంస్ చైర్మన్లు లింగాల కమల్ రాజ్ , కూరాకుల నాగభూషణం , రాయల శేషగిరిరావు ,ఖమ్మం మేయర్ పూనుకొల్లు నీరజ , సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ , తదితరులు పాల్గొన్నారు .

ఇటీవల మండల కేంద్రాల్లో జరిగిన ధర్నాలో పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం రాలేదు . మాజీ మంత్రి తుమ్మల కూడా కార్యక్రమానికి దూరంగా ఉన్నారు .ఎమ్మెల్యేలుగా పోటీచేసిన మదన్ లాల్ ,పిడమర్తి రవి కూడా రాలేదు . అయితే వీరిని పిలిచారా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. మాజీలలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు , బాలసాని లక్ష్మి నారాయణలు హాజరైయ్యారు . తుమ్మల , పొంగులేటి హాజరు కానందున వారి అనుయాయులు ఎవరు హాజరు కాకపోవడం గమనార్హం .

ఇక నిరసన కార్యక్రమంలో ప్రసంగించిన నాయకులంతా కేంద్రం ప్రభుత్వం, ప్రధాని మోడీపై విమర్శల వర్షం కురిపించారు. పనిలో పనిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన మాటలను గుర్తు చేస్తూ వారిని దుయ్యబట్టారు . తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనకపోతే బీజేపీ ని సాగనంపడమే నని హెచ్చరించారు .

Related posts

ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. జగన్‌ను ఇంటికి పంపండి: ఎంపీ సుజనా చౌదరి!

Drukpadam

కుటుంబ పాలనలో బందీ అయిన తెలంగాణ…కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Drukpadam

కాంగ్రెస్ పై మరోసారి నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ!

Drukpadam

Leave a Comment