Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జగన్ ఫ్రస్టేషన్ లో ఉన్నాడా? అందుకే ప్రతిపాపక్షలపై విరుచుక పడుతున్నారా ??

జగన్ ఫ్రస్టేషన్ లో ఉన్నాడా? అందుకే ప్రతిపాపక్షలపై విరుచుక పడుతున్నారా ??
-కడుపు మంట ఎక్కువైతే గుండెపోటుతో టికెట్ తీసుకుంటారని ప్రత్యర్థులపై జగన్ విసుర్లు
-చిక్కీ కవర్ పై జగన్ ఫొటో ఉందని ఎల్లో మీడియా రాస్తోందన్న సీఎం
-ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శ
-పార్లమెంటును కూడా కుట్రలకు వాడుకుంటున్నారన్న జగన్
-వెంట్రుకకుడా పీకలేరన్న జగన్ మాటలపై లోకేష్ ఎద్దేవా
-మీ ఎంట్రుకలు ప్రజలే పీకుతారని వ్యాఖ్య

 

ఏపీ సీఎం జగన్ ఫ్రస్టేషన్ లో ఉన్నారా ? అంటే అవుననే అంటున్నాయి ప్రతిపక్షాలు … కరోనా తగ్గిపోయిన తరువాత ఇటీవల జగన్ రెండు కార్యక్రమాలకు హాజరైయ్యారు . వాలంటీర్లను సన్మానించే సభకు పల్నాడు వెళ్లగా , రెండవది జిల్లాలు ఏర్పడిన తరువాత మొదటిసారిగా కొత్త జిల్లా కేంద్రమైన నంద్యాల వెళ్లారు . అక్కడ జరిగిన సభలో ఆయన ప్రతిపక్షాలపై ప్రధానంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు , పవన్ కల్యాణలపై తనదైన శైలిలో విరుచకపడ్డారు . స్కూల్ పిల్లలకు ఇచ్చే చిక్కి కవర్ పై జగన్ ఫోటో ఉండటాన్ని ప్రతిపక్షాలు తప్పు పెట్టడంపై ఆయన మండిపడ్డారు . ప్రతిదానికి ప్రతిపక్షాలు వారి అనుకూల మీడియా వ్యతిరేక ప్రచారం చేస్తుందని దేవుడి దయ , ప్రజల దీవెన ఉన్నంతవరకు వెంట్రుక కూడా ఎవరు పీకలేరని తలవెంట్రుకను చుపిస్తూ ఆయన చేసిన కామెంట్ వైరల్ అయింది. దీనిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ మాట్లాడుతూ ఆయన వెంట్రుక పీకే ఓపిక తీరిక తమకు లేదని ప్రజలే ఆయన వెంట్రుక పీకి సున్నం బొట్లు పెట్టి సాగనంపుతారని ట్విటర్ వేదికగా స్పందించారు .

అసలు నంద్యాల సభలో జగన్ ఏమన్నాడో చూద్దాం …

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నంద్యాలలో ‘వసతి దీవెన’ కార్యక్రమం సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ… ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా చేస్తానని ఇక్కడే చెప్పానని… చెప్పిన విధంగానే జిల్లాలను చేసి ఇక్కడకు వచ్చానని అన్నారు. దేవుని దయ, ప్రజల అభిమానం ఉన్నంత వరకు తన వెంట్రుక కూడా ఎవరూ పీకలేరని చెప్పారు.

స్కూలు పిల్లలకు ఇస్తున్న చిక్కీ కవర్ పై జగన్ ఫొటో ఉందని ఎల్లో మీడియా రాస్తోందని… కడుపు మంట, అసూయకు మందు లేదని… ఇవి రెండూ ఎక్కువైతే గుండెపోటు వచ్చి టికెట్ తీసుకుంటారని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇవ్వకుండా పెండింగ్ పెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు కూడా తామే ఇస్తున్నామని అన్నారు. జగనన్న ఉన్నాడనే నమ్మకంతో పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పిస్తున్నారని… ఇవన్నీ చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి, ఎల్లో మీడియాకు కనిపించవని ఎద్దేవా చేశారు.

రోజుకో కట్టు కథ చెప్పి ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు యత్నిస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఈ కుట్రకు పార్లమెంటును సైతం వాడుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇలాంటి ప్రతిపక్షం ఉండటం దురదృష్టకరమని అన్నారు. నాడు – నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నామని జగన్ చెప్పారు. స్కూలుకు పంపితే చాలు.. అమ్మఒడి డబ్బులు ఇస్తున్నామని తెలిపారు. అక్కచెల్లెమ్మల కోసం వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, సున్నా వడ్డీ రుణాలు అమలు చేస్తున్నామని చెప్పారు. కొత్తగా 16 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామని… నంద్యాలకు కూడా మెడికల్ కాలేజీ వస్తుందని తెలిపారు.

జగనన్న వసతి దీవెన కింద రూ. 1,024 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి వేస్తున్నామని చెప్పారు. ఇంట్లో ఎంత మంది చదివితే అంతమందికి ఇస్తామని అన్నారు. జగనన్న ఉన్నాడనే ధైర్యంతో ఉండాలని, అన్నీ తానే చూసుకుంటానని భరోసా ఇచ్చారు.

టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్ చూద్దాం …

ట్విట్టర్ ద్వారా నారా లోకేశ్ స్పందిస్తూ… గల్లీ నుంచి ఢిల్లీ వరకు పనికిమాలినోడని తేలిపోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ కాకపోతే ఏమొస్తుందని ఎద్దేవా చేశారు. ‘వెంట్రుక మహరాజ్, ఈకల ఎంపరర్ జగన్ గారూ… మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు’ అని ఎద్దేవా చేశారు.

మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో తాము పని చేస్తున్నామని లోకేశ్ అన్నారు. ప్రజలే మీ వెంట్రుకలు పీకడానికి, గుండు కొట్టించి పిండి బొట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ‘నా మాట విని మీరే గుండు కొట్టించుకోండి. మీ వెంట్రుక ఎవడు పీకుతాడో చూద్దాం’ అని అన్నారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే నాతోనే సాధ్యం… శశిథరూర్ …!

Drukpadam

కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారిన ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలు !

Drukpadam

ఇప్పుడు నాలుగో రాజధాని కూడా వచ్చి చేరింది: పయ్యావుల కేశవ్!

Drukpadam

Leave a Comment