Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఉక్రెయిన్ లో జుట్టు కత్తిరించుకుంటున్న అమ్మాయిలు… ఫ్యాషన్ కోసం కాదు!

ఉక్రెయిన్ లో జుట్టు కత్తిరించుకుంటున్న అమ్మాయిలు… ఫ్యాషన్ కోసం కాదు!

  • ఉక్రెయిన్ గడ్డపై రష్యన్ సైనికుల అరాచకాలు
  • మహిళలపై అత్యాచారాలు
  • ఓ గ్రామంలో అక్కాచెల్లెళ్లపై అఘాయిత్యం
  • మహిళలను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన వైనం

ఉక్రెయిన్ లో రష్యా సేనల అఘాయిత్యాలు అన్నీ ఇన్నీ కావని అక్కడి మీడియా ఎలుగెత్తుతోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో అమ్మాయిలు జుట్టు కత్తిరించుకోవడం వెనుక దిగ్భ్రాంతికరమైన కారణం ఉందని ఓ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఇవాన్ కివ్ ప్రాంతంలో టీనేజీలో ఉన్న ఇద్దరు అక్కాచెల్లెళ్లపై రష్యన్ సైనికులు అత్యాచారానికి పాల్పడ్డారని అక్కడి డిప్యూటీ మేయర్ ను ఉటంకిస్తూ సదరు కథనంలో వివరించారు.

“రష్యన్ల కామవాంఛలకు బలికాకూడదని ఉక్రెయిన్ అమ్మాయిలు కోరుకుంటున్నారు. ఆకర్షణీయంగా కనిపిస్తే రష్యన్ సైనికుల కళ్లు పడతాయని భయపడుతున్నారు. అందుకే జుట్టు కత్తిరించుకుంటున్నారు. ఓ గ్రామంలో 15, 16 ఏళ్ల వయసున్న అక్కాచెల్లెళ్లు అత్యాచారానికి గురయ్యాక అమ్మాయిల్లో భయం మరింత పెరిగిపోయింది. ఓ బేస్ మెంట్ లో తలదాచుకున్న మహిళలను రష్యన్ సైనికులు జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఆ తర్వాత వారు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో ఊహించలేం” అంటూ ఆ డిప్యూటీ మేయర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది.

Related posts

అంబటి రాంబాబే పెద్ద వస్తాదు: కన్నా లక్ష్మీనారాయణ

Drukpadam

2007 తర్వాత నేడు తొలిసారి శ్రీశైలం గేట్లను ఎత్తనున్న అధికారులు!

Drukpadam

ప్రధాని మోదీ యోగాసనాలు….

Drukpadam

Leave a Comment