Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జగన్ కు అగ్ని పరీక్షగా మారిన క్యాబినెట్ మార్పు …

జగన్ కు అగ్ని పరీక్షగా మారిన క్యాబినెట్ మార్పు …
-కొందరు ఉంటారు అంటే వారు ఎవరని ఆరా తీస్తున్న వైనం
-మంత్రివర్గ మార్పుల వల్ల అసంతృప్తి పెరిగే అవకాశం
-పక్క పార్టీల్లోకి తొంగిచూస్తున్న మాజీ మంత్రి
-మంత్రి పదవులు రానివారిలో అసహనం

ఏపీలో జగన్ కు కేబినెట్ విస్తరణ అగ్ని పరీక్షగా మారింది. రెండున్నర సంవత్సరాల్లో మంత్రులను మారుస్తానన్న మాట ప్రకారం ఇప్పుడున్న మంత్రులను మార్చేందుకు నిర్యాయించుకున్న సీఎం జగన్ అందుకు అనుగుణంగా వారినుంచి రాజీనామా పత్రాలు స్వీకరించారు . కానీ ఇక్కడ నుంచే మొదలైంది అసలు ట్విస్ట్ ….ఇప్పటివరకు పదవులు అనుభవించిన వారు వాటిని వదులుకోలేక ఉన్నారు . అయితే ఇందులో మరొకటి కూడా ఉంది. అందరిచేత రాజీనామాలు చేయించిన జగన్ అందులో కొందరిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుంటానని చెప్పడంతో కొత్త చిక్కు వచ్చిపడింది . అందరిని పక్కన పెట్టి కొత్తవారిని తీసుకుంటే అభ్యంతరంలేదుకాని, కొందరిని తీసుకోవడం ఏమిటి ? అనే ప్రశ్నలకు సమాదానాలు దొరకటం లేదు .మంత్రులుగా ఎవరిని తీసుకోవాలనేది పూర్తిగా సీఎం ఇష్టమై అయినప్పటికీ కొందరిపేరుతో మరికొందరిని అవమానపరచడం పై లోలోన కుమిలి పోతున్నారు .

మంత్రి పదవి దక్కకపోతే పార్టీని సైతం వీడేందుకు సిద్దపడుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం …అంత దైర్యం చేస్తారా ? చేస్తే ఇప్పడు మంత్రి పదవి సంగతి దేవుడెరుగు ఎమ్మెల్యే పదవి పోతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రస్తుతం కేబినెట్ లో మంత్రి పదవులు కోల్పోయిన వారిలో చాలా మంది మంత్రుల్ని పార్టీ అధిష్టానం తరఫున కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి బుజ్జగిస్తున్నారు. వారికి కేబినెట్ హోదాతో ఇతర పదవులు కట్టబెడతామని హామీ ఇస్తున్నారు. అయినా వారు వెనక్కి తగ్గేందుకు ససేమిరా అంటున్నారు. వీరిలో కొందరు మాత్రం ప్రభుత్వ హామీలతో సంతృప్తి చెందుతుండగా.. మిగతావారు మాత్రం పదవి ఇవ్వకపోతే తమ దారి చూసుకుంటామని అంతర్గతంగాసన్నిహితులతో వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో వీరి విషయంలో ఏం చేయాలో తెలియక అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది.

పైకి ఎన్నిమాటలు చెప్పుకున్నా ఉన్న మంత్రి పదవి సగం కాలానికే వదులుకోవాల్సి రావడం, మరోసారి అవకాశం దక్కుతుందో లేదో తెలియని పరిస్ధితి, భవిష్యత్తులో అవకాశం రావాలంటే పార్టీని గెలిపించాలన్న కండిషన్ ఇప్పుడు వైసీపీ తాజా మాజీ మంత్రుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీని కంటే మంత్రి పదవి దక్కకుంటే ప్రత్యర్ధి పార్టీలో చేరిపోయి వచ్చే ఎన్నికలకు సిద్ధంకావడమే మేలనే భావనలో కొందరిలో కనిపిస్తోంది. అందుకే మంత్రి పదవి ఇవ్వకపోతే మాత్రం పార్టీ మారేందుకు ఉన్న అవకాశాల్ని వారు పరిశీలిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి తనకు ఎలాగో కేబినెట్ బెర్తు మరోసారి దక్కదనే నిర్ణయానికి వచ్చేసి టీడీపీతో టచ్ లోకి వెళ్లిపోయారు. అక్కడ ఎమ్యెల్యే సీటుతో పాటు గెలిస్తే మంత్రి పదవి హామీ కూడా ఆయనకు లభించింది. ఇదే బాటలో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టేశారు.

క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు సీఎం జగన్ కు నిజంగా కత్తిమీద సమూలంగా ఉంది. అన్నిటిని అధిగమించి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే బలమైన నేతగా గుర్తింపు ఉంటుంది. ఎమ్మెల్యేలు కూడా ఎవరు పార్టీ మారాలనే సాహసం చేయరు . ఒకవేళ ఒకరిద్దరు పార్టీ మారితే అది మార్చగానే మిగులుతుంది. మరో ఏడాదిలో ఎన్నికల వాతావరణం వస్తుంది. అప్పటివరకు పార్టీని ఐక్యంగా నిలబెట్టగలిగితే జగన్ సగం విజయం సాధించినట్లే చెప్పవచ్చు … ఈ అగ్ని పరీక్షను జగన్ ఏ విధంగా తట్టుకుంటారో చూడాలి మరి !

 

Related posts

కోయంబత్తూరులో కమల్ హాసన్ ముందంజ…

Drukpadam

రాష్ట్రంపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారు: జూపూడి ఫైర్…

Drukpadam

మీడియా నా టీ షర్ట్ మాత్రమే చూసింది.. పేదల చిరిగిన బట్టలను పట్టించుకోలేదు: రాహుల్ గాంధీ!

Drukpadam

Leave a Comment