జగన్ కు మంత్రి పదవుల తలనొప్పులు ….మంత్రి పదవి రానివారి అలక!
-విజయవాడలో బాలినేని నివాసానికి వచ్చిన సజ్జల… బుజ్జగించేందుకేనా…?
-కమ్మ , బ్రామ్మణ,వైశ్య సామాజికవర్గాలు విస్మరించడంపై విస్మయం
-ఏపీలో కొత్త క్యాబినెట్ కూర్పు పై విమర్శలు
-కసరత్తులు పూర్తి చేసిన సీఎం జగన్, సజ్జల
-రేపు మంత్రివర్గ ప్రమాణస్వీకారం
-మంత్రివర్గ విస్తరణ అంశాలపై బాలినేనితో సజ్జల భేటీ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని మార్చుకునేందుకు నిర్ణయించుకున్నారు … ఇంతవరకు ఒకే … అయితే అందులోనే బీసీలకు పెద్ద పీట పేరుతొ కొన్ని సామాజికవర్గాలు విస్మరించడంపై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. బీసీ ,ఎస్సీ , ఎస్టీ , మైనార్టీలకు పెద్ద పీట వేశారు సరే కానీ ప్రధానమైన కమ్మ సామాజికవర్గానికి క్యాబినెట్ లో బెర్తు లేకపోవడం విస్మయానికి గురిచేసింది. అదే విధంగా వైశ్య , బ్రామ్మణ సామాజికవర్గాలవారికి ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. బీసీలకు పెద్ద పీట పేరుతొ మిగతా వర్గాలను విస్మరించడంపై అసంతృప్తులు వెల్లు ఎత్తే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లా నుంచి ఒక్కరిని కూడా క్యాబినెట్ లోకి తీసుకోకపోవడం పై కూడా జగన్ ను వేలెత్తి చూపుతున్నారు . ఇది ఎక్కడి న్యాయం అంటున్నారు .ఆ జిల్లాకు చెందిన జగన్ సమీపబంధువు , బాలినేని శ్రీనివాస్ రెడ్డి ని తప్పించేందుకు , ఆదిమూలపు సురేష్ కు కూడా మంత్రిపదవి లేకుండా పోయింది. ఇది భవిష్యత్ లో తీవ్ర నష్టం చేసే అవకాశం ఉందని అంటున్నారు .
దీంతో ఏపీ కొత్త క్యాబినెట్ కూర్పు పూర్తయిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం జగన్ తో కొత్త క్యాబినెట్ కూర్పుపై కసరత్తులు ముగిసిన అనంతరం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… విజయవాడ బందరు రోడ్డులోని బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి తరలి వెళ్లారు. మంత్రివర్గ విస్తరణ అంశాలపై బాలినేనితో చర్చించారు. బాలినేని ఇంటికి సజ్జల ఎందుకు వచ్చారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బాలినేని ఇప్పటిదాకా విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. విద్యుత్ రంగ సంక్షోభం నేపథ్యంలో ఆయనపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో బాలినేనికి కొత్త క్యాబినెట్ లో చోటు దొరుకుతుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, సజ్జల విజయవాడలో బాలినేని ఇంటికి వెళ్లడం బుజ్జగించే ప్రయత్నంలో భాగమేనని ప్రచారం జరుగుతోంది.