Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భద్రాద్రి మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం -పులకించిన భక్త జనం!

భద్రాద్రి మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం
-పులకించిన భక్త జనం!
-ప్రభుత్వం తరుపున ముత్యాల తలంబ్రాలు ,పట్టు వస్త్రాలు
-హాజరైన దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ,రవాణా మంత్రి పువ్వాడ అజయ్
-టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి , భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 

భద్రాచలంలో శ్రీసీతారామ కల్యాణ మహోత్సాహం మిథిలాస్టేడియం లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సాహాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు . కరోనా ప్రభావంతో గతరెండు సంవత్సరాలుగా దేవాలయ ప్రాంగణంలో జరిపిన కళ్యాణం తిరిగి మిథిలా స్టేడియం లో జరగడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు . దీంతో చాలాకాలం తరవాత భద్రాచల పురవీధుల భక్తులతో కిటకిటలాడాయి . గోదావరి తీరంలో వేలాది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు . రెండు రోజుల ముందు నుంచే భక్తులు భద్రాచలం చేరుకున్నారు .తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా , పక్కనే ఉన్న ఛత్తీస్ ఘడ్ , మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు సీతారాముల కళ్యాణ్ తిలకించేందుకు వచ్చారు .

 

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వేద మంత్రోచ్చాయలతో నిర్వహించారు. భద్రాచలం మొత్తం భక్తులతో రామ నామ స్మరణతో మారు మ్రోగింది. ఆధ్యాత్మిక సందడి నెలకొన్నల భద్రాచల పుణ్యక్షేత్రం. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం.
భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని వీక్షించి పులకించిన భక్తకోటి. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్. భద్రాద్రి పుణ్యక్షేత్రంలోని మిధిలా స్టేడియంలోశ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని తిలకించారు.

వేద మంత్రోత్సవాలు, మంగళవాయిద్యాల మధ్య కమనీయంగా నిర్వహించారు. భక్తుల భక్తిభావంతో, భక్తిశ్రద్ధలతో శ్రీ రామ జయ రామ జయ జయ రామ ధ్వనుల మధ్య అభి జిత్ ముహూర్తాన శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయంగా కన్నుల పండువగా జరిగింది. శ్రీ రామ భక్తుడైన భక్త రామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించుకుని రామయ్య పెండ్లి కొడుకుగా, సీతమ్మ పెండ్లి కుమార్తెగా దర్శనమిచ్చారు. సుముర్తాన జిలకర్ర, బెల్లం పెట్టారు. అనంతరం మాంగళ్యధారణ జరిగింది. ఆనవాయితీగా వస్తున్న రాములోరికి రాష్ట్ర ప్రభుత్వము తరపున రాష్ట్ర దేవాదాయ, రవాణా శాఖ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పూవ్వాడ అజయ్ కుమార్ దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. టిటిడి తరపున వై.వి. సుబ్బారెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించుకున్నారు. రెండు సంవత్సరాలు తరువాత జరిగిన కల్యాణ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర నలుమూల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చారు. భద్రాద్రి ఆసాంతం భక్తుల సందడితో నిండిపోయింది. శ్రీరామ నామస్మరణతో భద్రగిరి మారుమోగింది. కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాల తరువాత శ్రీసీతారాముల కళ్యాణ ఉత్సవాలు నిర్వహించడంతో రాష్ట్ర నలుమూల నుండి భక్తకోటి జనం కుటుంబ సభ్యులతో తరలివచ్చి స్వామి వారి కళ్యాణాన్ని తిలకించి, స్వామి దర్శనభాగ్యం పొంది పునితులైనారు. పెద్దఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్ నేతృత్వంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు.

భక్తులకు సమగ్ర సమాచారం అందిస్తే ఉత్సవాలు విజయవంత మైనట్లేనని కాబట్టి గతంలో 5 కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేసే సమాచార కేంద్రాలను 25 ఏర్పాటు చేపించి భక్తుల కొరకు ప్రత్యేకంగా మల్టీ కలర్ సమాచార కరపత్రాలను తయారు చేపించారు. ప్రతి ఒక్కరికి తలంబ్రాలు అందాలని 175 క్వింటాలు తలంబ్రాలు సిద్ధం చేశారు. గతములో 15 కేంద్రాలు మాత్రమే తలంబ్రాలు కొరకు ఏర్పాటు చేసేవారు. ఈ సంవత్సరం దాదాపు 80 తలంబ్రాలు కేంద్రాలు ఏర్పాటు చేపించారు. సెక్టార్లో భక్తులు ఇబ్బంది పడకుండా ప్రతి సెక్టార్ కు రెవెన్యూ, పోలీస్ అధికారులతో పాటు జిల్లా అధికారులను నియమించారు. పట్టణంలో పార్కింగ్ ప్రాంతాల సమాచారం భక్తులు తెలుసుకునే విదంగా ముంది నుండి అవగాహన కల్పించారు. సమాచార శాఖ ద్వారా 25 సమాచార కేంద్రాలు ఏర్పాటుతో పాటు కళ్యాణ మండపం నుండి పట్టణం మొత్తం రామ నామం వినిపించే విధంగా మైక్ లు ఏర్పాటు చేశారు .

కల్యాణ వేడుకలకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, భద్రాచలం శాసన సభ్యులు పొందేం వీరయ్య, భద్రాచలం, ఖమ్మం జడ్పి చైర్మన్లు కోరం కనకయ్య, లింగాల కమల్ రాజు, ఖమ్మం, ములుగు కలెక్టర్లు విపి గౌతమ్, కృష్ణ ఆదిత్య, ఐటిడిఎ పిఓ గౌతమ్ పోట్రూ హై కోర్ట్, జిల్లా న్యాయ మూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ సునీల్ దత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు. వేడుకలు అంగరంగ వైభవంగా, అధ్యతం భక్తి భావంతో జరగడం పట్ల జిల్లా కలెక్టర్ అనుదీప్ హర్షం వ్యక్తం చేశారు. వేడుకలు నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ తాతా మధు, హైకోర్టు జడ్జి వెంకటేశ్వర్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, భద్రాచలం శాసనసభ్యులు పొదేం వీరయ్య, ఖమ్మం కలెక్టర్ వి పీ గౌతం, ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటిడిఎ పిఓ గౌతమ్ పోట్రూ, భద్రాద్రి, ఖమ్మం జడ్పీ చైర్మన్లు కోరం కనకయ్య, లింగాల కమల్ రాజు, దేవస్థానం ఈవో శివాజీ, ఎస్పీ సునీల్ దత్, భద్రాద్రి ఇన్చార్జి సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ రోహిత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమెరికాలో మళ్లీ మంచు తుపాను బీభత్సం.. 1500 విమానాలు రద్దు, రోడ్ల మూసివేత!

Drukpadam

ఢిల్లీ శాసనసభ నుంచి ఎర్రకోట వరకు సొరంగం!

Drukpadam

పువ్వాడ నాగేశ్వరరావును పరామర్శించిన తమ్మినేని, పోతినేని…!

Drukpadam

Leave a Comment