Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డి…

తెలంగాణలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డి…
శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి
కీలక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్
కోమటిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగింత
సోనియా గాంధీ ఆమోదం
ఏఐసీసీ నుంచి ప్రకటన

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పై ద్రుష్టి సారించింది. పార్టీ అధ్యక్ష రేసులో ఉండి ఆపదవి దక్కక తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ నియమించింది. సీనియర్ నాయకుడిగా దూకుడుమీద ఉన్న వెంకటరెడ్డికి ముఖ్యమైన భాద్యత అప్పగించడంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డికి ,వెంకటరెడ్డి తోడైతే ఇక మంచిరోజులు ననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం దృష్టి సారించింది. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చిన నేపథ్యంలో అసంతృప్తికి గురయ్యాడని భావిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తాజాగా కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డిని నియమించింది. ఈ మేరకు అధిష్ఠానం నుంచి ప్రకటన వెలువడింది. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.

కాగా, పార్టీ సహచరుడు కొత్త బాధ్యతలు అందుకుంటున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా నియమితులైనందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు సోదరా అంటూ ట్వీట్ చేశారు.

Related posts

ఎయిమ్స్ లో రఘురామకు వైద్య పరీక్షలు.. రెండు కాళ్లకు కట్లు …

Drukpadam

కేసీఆర్ కుటుంబంపై మోదీ డైరెక్ట్ అటాక్…

Drukpadam

వరంగల్ సభకు రాహుల్‌గాంధీ.. అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరన్న రేవంత్!

Drukpadam

Leave a Comment