అలక వీడని సుచరిత.. అనారోగ్య కారణంతో సజ్జలను కలిసేందుకు నిరాకరణ!
మంత్రి పదవి దక్కనందుకు అలక
న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ఎంపీ మోపిదేవి
రెండు రోజులుగా గుంటూరులో కార్యకర్తల ఆందోళన
మంత్రి పదవి రాకపోవడం తో అలిగిన ,పార్టీని వీడేందుకు సిద్దపడని అనేకమంది ఎమ్మెల్యేలు మెత్తబడి జగన్ కలిసి తమకు జగన్ ఏది చెపితే అది చేస్తామని చెప్పుతున్నారు .అందుకు పార్టీ యంత్రాగం బాగేనే పని చేసింది. ప్రధానంగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణ రెడ్డి , గడికోట శ్రీకాంత్ రెడ్డి లు అసమ్మతివాదులు బుజ్జగించేందుకు తమ వంతుగా తీవ్ర ప్రయత్నాలు చేసి చాలావరకు సెక్సెస్ అయ్యారు . అయితే మాజీ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత మాత్రం ఎమ్మెల్యే పదవి చేసిన రాజీనామా ను వెనక్కు తీసుకోనని చెబుతుంది. సజ్జల ఫోన్ చేసి రమ్మంటే తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆమె కలిసేందుకు నిరాకరించారు.అయితే ఆమె పై వేటు వేయాలా లేదా అనే ఆలోచనలో పార్టీ ఉంది . ఆమె విషయంలో పార్టీ చాల సీసరియస్ గానే ఉంది.
మంత్రి పదవి దక్కనందుకు అలకబూనిన సీనియర్ ఎమ్మెల్యే, ఏపీ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత పట్టువీడడం లేదు. ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేసినా అలకవీడడం లేదు. ఆదివారం రాత్రి సుచరిత ఇంటికి వెళ్లిన మోపిదేవి.. సామాజిక సమీకరణాల వల్లే కేబినెట్‌లో చోటు కల్పించలేకపోయామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
అలాగే, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆమెకు ఫోన్ చేసి, రమ్మని చెప్పారు. అయితే, అనారోగ్యం కారణంగా ఆమె వెళ్లలేదని ఆమె సన్నిహితులు చెప్పారు. వీరిద్దరు మినహా అధిష్ఠానం నుంచి సుచరితతో ఎవరూ మాట్లాడలేదని ఆమె అనుచరులు చెబుతున్నారు.
మరోవైపు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు సుచరిత ఆదివారం ప్రకటించారు. అయితే, వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పదవికి రాజీనామా చేసినా పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సుచరితకు మంత్రి పదవి దక్కకపోవడంతో కార్యకర్తలు రెండు రోజులుగా గుంటూరులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.