Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వాఘా స‌రిహ‌ద్దు వ‌ద్ద జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.. తొలి సీజేఐగా రికార్డు!

వాఘా స‌రిహ‌ద్దు వ‌ద్ద జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.. తొలి సీజేఐగా రికార్డు!

  • నేటి ఉదయం వాఘా బోర్డ‌ర్‌కు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌
  • బీఎస్ఎఫ్ గౌర‌వ వంద‌నాన్ని స్వీక‌రించిన వైనం
  • అరుదైన రికార్డును న‌మోదు చేసిన చీఫ్ జ‌స్టిస్  

భార‌త సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అరుదైన గుర్తింపును సంపాదించారు. భార‌త్‌, పాక్ స‌రిహ‌ద్దుల్లోని వాఘా బోర్డ‌ర్‌ను సంద‌ర్శించిన తొలి భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ త‌న‌పేరిట ఓ అరుదైన రికార్డును లిఖించుకున్నారు.

గురువారం ఉద‌యం జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ వాఘా బోర్డ‌ర్‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ భార‌త స‌రిహ‌ద్దు ర‌క్ష‌క ద‌ళం(బీఎస్ఎఫ్‌) గౌర‌వ వంద‌నాన్ని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ స్వీక‌రించారు. తెలుగు నేల‌కు చెందిన జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ న్యాయ‌వాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి హైకోర్టు న్యాయ‌మూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా అంచెలంచెలుగా ఎదిగారు. చివర‌కు భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఆయ‌న అత్యున్న‌త ప‌ద‌విని అలంక‌రించారు. సీజేఐగా ప‌లు కీల‌క సంస్క‌ర‌ణ‌లకు శ్రీకారం చుట్టిన జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌.. తాజాగా వాఘా బోర్డ‌ర్‌ను సంద‌ర్శించిన తొలి సీజేఐగా రికార్డు పుట‌ల్లోకి ఎక్కారు.

Related posts

The Internet’s Going Crazy Over This £3.30 Mascara

Drukpadam

పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌కు షాక్‌.. అవిశ్వాసంపై ఓటింగ్ త‌ప్ప‌ద‌న్న సుప్రీంకోర్టు

Drukpadam

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత!

Drukpadam

Leave a Comment