Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఢిల్లీకి సమీపంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. విద్యార్థులపై ప్రభావం!

ఢిల్లీకి సమీపంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. విద్యార్థులపై ప్రభావం!
-నోయిడాలో కొత్తగా 53 కేసులు
-ఒక స్కూల్లోని 13 మంది విద్యార్థులకు కరోనా
-నోయిడా, ఘజియాబాద్ లో పలు స్కూళ్లకు సెలవులు

దేశంలో కరోనా వైరస్ మళ్లీ ప్రభావం చూపుతోంది. కరోనా పోయిందని సంబరపడుతున్న వేళ తిరిగి అది కొంతమందికి అందులో స్కూల్ విద్యార్థులకు సోకుతుందని వార్తలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. మహారాష్ట్రలో కొన్ని కేసులు వెలుగుచూశాయని వార్తలు వచ్చిన పెద్దగా ఆందోళన చెందని ప్రజలు తిరిగి ఢిల్లీలో కేసులు రావడంపై కంగుతింటున్నారు . ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ సృష్టించిన కరోనా … ఇప్పుడు మరోసారి క్రమంగా వ్యాప్తి చెందుతోంది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న నోయిడాలో కేసులు అమాంతం పెరిగాయి. గత 48 గంటల్లో నోయిడాలో కొత్తగా 53 కేసులు వెలుగుచూశాయి. అయితే వీటిలో ఎక్కువ కేసులు పాఠశాలల్లో వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.

నోయిడా సెక్టార్ 40లోని ప్రైవేట్ స్కూల్లో 13 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఘజియాబాద్ లోని స్కూల్లో 13 ఏళ్ల విద్యార్థికి కరోనా సోకింది. దీంతో నోయిడా, ఘజియాబాద్ లలో పలు ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ప్రకటించి, ఆన్ లైన్ క్లాసులను నిర్వహిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ లోని ఎల్452 మ్యుటేషన్ కేసులు ఇప్పుడు భారత్ లో నమోదవుతున్నాయి.

కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేసింది. అంతకు ముందు ఉన్న కరోనా నిబంధనలు కేంద్ర సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తి వేశాయి. ఎవరు మాస్క్ ధరించడం లేదు . చాలామంది బస్టర్ డోస్ వేసుకోలేదు . భౌతిక దూరం పాటించడం లేదు . ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా తో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే .

Related posts

కేజ్రీవాల్ పై మండిపడ్డ హర్యానా సీఎం ఖట్టర్…

Drukpadam

జాదవ్ ఆలా సీరం ఇలా …..

Drukpadam

కరోనా కొన్ని తరాల పాటు మనతోనే ఉంటుంది: ఐపీహెచ్ డైరెక్టర్ జీవీఎస్ మూర్తి…

Drukpadam

Leave a Comment