సాగర్ లో బీజేపీ ప్రయోగం సక్సెస్ అవుతుందా ?
బీజేపీ కన్ఫ్యూజన్ లో పడిందా ?
-నాగార్జున సాగర్ లో పార్టీ నిర్ణయం సరైనదేనా ??
-జనరల్ స్థానంలో ఎస్టీ ప్రయోగం సక్సెస్ అవుతుందా ???
-టీఆర్ యస్ ,కాంగ్రెస్ ను ఢీకొనే సత్తా బీజేపీకి ఉంటుందా ????
తెలంగాణాలో తామే అధికారం లోకి రాబోతున్నామని 2023 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ అని అందుకు తగ్గట్లుగా పార్టీ యంత్రాగాన్ని తయారు చేస్తున్నామని చెబుతున్న బీజేపీకి నిజంగా నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ యస్ , కాంగ్రెస్ లను ఢీకొనే సత్తా ఉందా? ఎస్టీ అభ్యర్థి ప్రయోగం సక్సెస్ అవుతుందా ? పార్టీ నిర్ణయం సరైందేనా ? పార్టీ కన్ఫ్యూజన్ లో పడిందా ? అనే సందేహాలకు ఏప్రిల్ 17 ఓటర్లు ఇచ్చే తీర్పు పైనే ఆధారపడి ఉంటుంది.
బీజేపీ తన అభ్యర్థిగా పి . రవికుమార్ ను ప్రకటించింది. అక్కడ నుంచి ఒక రెడ్డి యాదవ , సామాజికవర్గం నుంచి టికెట్ ఆశించినప్పటికీ ఒక జనరల్ స్థానంలో ఎస్టీ కి టికెట్ ఇచ్చి నిలబెట్టటం అభినందనీయం .ఇదే విధంగా అన్ని నియోజవర్గాలలో బీజేపీ చేయాలనీ కోరుకుందాం . కాని అక్కడ అందుకు తగ్గ ప్రరిస్థితులు ఉన్నాయా? అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు . ఇది ఆంధ్రా ,తెలంగాణ సరిహద్దులలో ఉన్న నియోజవర్గం . నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇక్కడే ఉన్ననందున అంతుకుముందు ఉన్న చలకుర్తి పేరు మారి నాగార్జున సాగర్ గా అయింది . పునర్విభజన తరువాత ఇప్పటికి మూడు సార్లు ఎన్నికలు జరగగా రెండు సార్లు కాంగ్రెస్ తరుపున పోటీచేసిన జానారెడ్డి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో టీఆర్ యస్ తరుపున పోటీచేసిన నోముల నరసింహయ్య జానారెడ్డి పై విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన కంకణాల నివేదిత రెడ్డికి కేవలం 2675 ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్లు పోగుట్టుకున్నది . ఐతే గత ఎన్నికల నాటికన్నా బీజేపీ పరిస్థితి బాగా మెరుగు పడింది. దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక, గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ గ్రాఫ్ పెరిగింది. దుబ్బాక గెలవటం , హైద్రాబాద్ ఎన్నికలలో టీఆర్ యస్ కు గట్టి పోటీ ఇవ్వటం తో టీఆర్ యస్ కు బీజేపీ నే ఆల్టర్ నేటివ్ గా ఉండనే అభిప్రాయాలూ వ్యక్తం అయ్యాయి.అయితే దుబ్బాకలో పార్టీ ఇమేజ్ కన్నా టీఆర్ యస్ వ్యతిరేకతతో పాటు బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన రఘునందనరావు పట్ల ఓటర్లలో సానుభూతి బాగా పనిచేసింది. హైద్రాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ కి పట్టు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి.టీఆర్ యస్ మీద వ్యతిరేకత పనిచేసింది. సాగర్ పరిస్థితి వేరు ఇక్కడ బీజేపీకి పెద్దగా యంత్రంగం లేదు. పైగా గత ఎన్నికల్లో 2675 ఓట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చిందని , పెట్రోల్ ,డీజిల్ రేట్ల పెరుగు దలకు కేంద్రప్రభుత్వమే కారణమని ప్రజలలో బలంగా ఉంది. ఇక్కడ గిరిజన ఓట్ల కోసమే లంబాడా గిరిజన తెగకు చెందిన డాక్టర్ రవికుమార్ కు టిక్కెట్ ఇచ్చారనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఇక్కడ యాదవుల ఓట్లతో పాటు లంబాడీల , రెడ్ల ఓట్లు గణనీయమైన సంఖ్యలోనే ఉన్నాయి. రెడ్లు , యాదవులు , ప్రభావిత కులాలుగా ఉన్నాయి. మిగతా కులాల ఓట్లు కూడా ఉన్నప్పటికీ ఈ మూడు కులాలే గెలుపోటములను నిర్ణయిస్తాయి. కాండిడేట్ సెలక్షన్ లో మంచి నిర్ణయం తీసుకున్నారనే భిప్రాయం ఉన్న అది ఓట్లర్ల ను గంపగుత్తగా మార్చే అవకాశం లేదనే అభిప్రాయాలే ఉన్నాయి. దీంతో బీజేపీ ఇక్కడ సరైన నిర్ణయమే తీసుకుందా? లేక కన్ఫ్యూజన్ లో పడిందా ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.సాగర్ లో టికెట్ ఆశించిన ఆశించి అది రాకపోయే సరికి కడారి అంజయ్య యాదవ్ టీఆర్ యస్ చేరగా , టికెట్ ఆశించి నామినేషన్ వేసి తిరస్కరణకు గురైన నివేదితారెడ్డి డైలమాలో ఉన్నారు. బీజేపీ కొద్దీ రోజుల క్రితం వరకు మంచి ఊపు మీద ఉన్నట్లు కనిపించింది. ఇటీవల కాలంలో కొంత దాని స్పీడ్ తగ్గింది. రాష్ట్ర వివిధ పార్టీలలో ఉన్న అసంతృప్త వాదులు బీజేపీ లో చేరాలని అనుకున్న తమ నిర్ణయంపై పునరాలోచనలో పడ్డారు. బీజేపీ అప్పడప్పుడు ఈ లాంటి సంచల నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఖమ్మం పార్లమెంట్ నుంచి బీజేపీ తరుపున ఎవరు పోటీచేసిన 25 వేల నుంచి 30 వేల కు మించి ఓట్లు రాలేదు. ఒకసారి రవీంద్రనాయక్ బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. ఆయనకు 2 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి.ఇక్కడ కూడా బీజేపీ ఓట్లు పెరగటం ఖాయం ,అవి ఎవరికి నష్టం అనేది చూడాలి !!!