నెల్లూరు జిల్లా వైసీపీ లో డిస్యుమ్… డిస్యుమ్…
-మంత్రి కాకాని వర్సెస్ మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్
-మంత్రి కాకాని సన్మానం రోజే , అనికుమార్ బహిరంగసభ
-ఎట్టి పరిస్థితుల్లో సభ నిర్వహిస్తా నంటున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
-నెల్లూరు జిల్లా వైసీపీలో రచ్చకెక్కుతున్న విభేదాలు
-రేపు నెల్లూరులో జరగనున్న మంత్రి కాకాణి సన్మాన కార్యక్రమం
-ఇదే రోజు సభను పెడుతున్న అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు జిల్లా వైసీపీలో అంతర్గత పోరు రచ్చకెక్కింది. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మధ్య నెలకొన్న వివాదం తీవ్రతరమైంది. మంత్రి కాకాణి కోసం నెల్లూరులో రేపు సభను నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో అనిల్ కుమార్ యాదవ్ కూడా కార్యకర్తలతో బహిరంగసభను ఏర్పాటు చేస్తున్నారు. సభ ఏర్పాట్లను ఈరోజు అనిల్ పరిశీలించారు. సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని తన అనుచరులను ఆదేశించారు. అంతేకాదు రాత్రి భోజనంతో పాటు ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా అనిల్ తో పాటు పలువురు వైసీపీ నేతలు ఉండటం గమనార్హం.
ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ సభను నిర్వహించి తీరుతామని చెప్పారు. ఇది ఎవరికీ పోటీ సభ కాదని అన్నారు. మూడు రోజుల ముందే సభకు అనుమతి తీసుకున్నామని తెలిపారు. సభను వాయిదా వేసుకోవాలని పార్టీ హైకమాండ్ కూడా చెప్పలేదని అన్నారు. ఎవరో కార్యక్రమం పెట్టుకున్నారని, తాను సభను పెట్టడం లేదని చెప్పారు.