Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మద్యం మ‌త్తులో గురుద్వారాలోకి వెళ్లారంటూ.. పంజాబ్ సీఎంపై పోలీసు కంప్లైంట్‌!

మద్యం మ‌త్తులో గురుద్వారాలోకి వెళ్లారంటూ.. పంజాబ్ సీఎంపై పోలీసు కంప్లైంట్‌!

  • వైశాఖి ప‌ర్వ‌దినాన ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు ఆరోప‌ణ‌
  • పంజాబ్ డీజీపీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేత బ‌గ్గా
  • శుక్ర‌వారం ఇదే ఆరోప‌ణ‌తో మాన్‌పై ఎస్జీపీసీ ఆగ్ర‌హం

పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్‌పై శ‌నివారం ఆ రాష్ట్ర పోలీసుల‌కు ఓ ఫిర్యాదు అందింది. మ‌ద్యం మ‌త్తులో భ‌గ‌వంత్ మాన్ గురుద్వారాలోకి ప్ర‌వేశించార‌ని, దీంతో ఆయ‌న‌పై కేసు న‌మోదు చేయాల‌ని బీజేపీకి చెందిన యువ నేత తేజింద‌ర్ పాల్ సింగ్ బ‌గ్గా నేరుగా పంజాబ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు భ‌గ‌వంత్ మాన్‌పై తాను పోలీసుల‌కు చేసిన ఫిర్యాదు ప్ర‌తుల‌ను బ‌గ్గా సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు.

ఇదిలా ఉంటే… ఈ నెల 14న వైశాఖి సంద‌ర్భంగా తాగిన మత్తు ఇంకా దిగ‌కుండానే గురుద్వారాలోకి ప్ర‌వేశించారంటూ శిరోమ‌ణి గురుద్వారా ప్ర‌బంధ‌క్ క‌మిటీ (ఎస్జీపీసీ) భ‌గ‌వంత్ మాన్‌పై శుక్ర‌వారం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి భ‌గ‌వంత్ మాన్ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని కూడా ఎస్జీపీసీ డిమాండ్ చేసింది. తాజాగా అదే ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావిస్తూ మాన్‌పై కేసు న‌మోదు చేయాలంటూ బ‌గ్గా నేరుగా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం.

Related posts

బావుల పనులకు అధికారి లంచం డిమాండ్..రూ. 2 లక్షలు వెదజల్లిన సర్పంచ్.. !

Drukpadam

పకడ్బందీగా ప్లాన్ చేసి మట్టుబెట్టామే.. మీరెలా పసిగట్టారు.. డాక్టర్ రాధ భర్త ప్రశ్నకు పోలీసుల షాక్..!

Ram Narayana

58 ఏళ్ల మహిళపై 16 ఏళ్ల టీనేజర్ అత్యాచారం..హత్య..

Drukpadam

Leave a Comment