Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు!

టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు!
-ప్ర‌భుత్వాన్నిర‌ద్దు చేస్తాన‌ని తాను అన‌లేదన్న గవర్నర్
-పాత వీడియోల‌తో సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేశారని విమర్శ
-మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా విమ‌ర్శించారన్న తమిళిసై

తెలంగాణ‌లోని టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌రరాజ‌న్ సోమ‌వారం నాడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రోజుల వ్య‌వ‌ధిలోనే రెండో సారి ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన త‌మిళిసై సోమ‌వారం ఢిల్లీలోనే మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా గ‌తంలో ఏనాడూ టీఆర్ఎస్ స‌ర్కారుపై చేయ‌నంత ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘ‌న‌ల‌పై కేంద్రం త‌న ప‌ని తాను చేసుకుపోతుందని ఆమె చెప్పుకొచ్చారు. గత కొంతకాలంగా టీఆర్ యస్ ప్రభుత్వానికి ,గవర్నర్ కు మధ్య విభేదాలు తలెత్తిన మాట విదితమే . ఇటీవల కాలంలో రాజ్ భవన్ కు , సీఎం కార్యాలయానికి మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. భద్రాచలం పట్టాభిషేకానికి వచ్చిన స్నాదర్భంలో సైతం ఆమెకు ప్రోటోకాల్ సమస్య తలెత్తింది. అధికారులు సెలవుపై వెళ్లారు .అయినప్పటికీ ఆమె తన పర్యటన కొనసాగించారు.

ఈ సంద‌ర్భంగా త‌మిళిసై మాట్లాడుతూ… ‘నేను రాజ‌కీయం చేస్తున్నాన‌ని అన‌వ‌స‌రంగా విమ‌ర్శిస్తున్నారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా విమ‌ర్శించారు. పాత వీడియోల‌తో సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘ‌న‌ల‌పై కేంద్రం త‌న ప‌ని తాను చేసుకుపోతుంది. నేను ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేస్తాన‌ని అన‌లేదు. ఇత‌ర రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్‌తో విభేదాలున్నా.. రాజ్ భ‌వ‌న్‌ను గౌర‌విస్తున్నారు’ అంటూ గవర్నర్ వ్యాఖ్యానించారు.

Related posts

టెట్ అభ్యర్థులకు తీపి కబురు.. ఉత్తీర్ణత ఇక జీవితకాలం చెల్లుబాటు!

Drukpadam

పాతబస్ స్టాండ్ ఉండాల్సిందే టీపీసీసీ చీఫ్-ఉత్తమ్ కుమార్ రెడ్డి…

Drukpadam

కరోనాపై పోరులో భారత ప్రస్థానం అపూర్వం: రిపబ్లిక్ డే ప్రసంగంలో రాష్ట్రపతి!

Drukpadam

Leave a Comment