Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైసీపీ జిల్లా అధ్య‌క్షుల నియామ‌కం… జాబితా ఇదే!

వైయస్సార్ సీపీ లో పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టిన సీఎం జగన్
జిల్లా అధ్యక్షులు , రీజనల్ కోఆర్డినేటర్లను నియమించారు .

  • 26 జిల్లాల‌కు 26 మంది అధ్య‌క్షులు
  • జాబితాలో 10 మంది తాజా మాజీ మంత్రులు
  • జిల్లా అధ్య‌క్షులుగా చెవిరెడ్డి, జ‌క్కంపూడి రాజా, క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ

వైసీపీలో పార్టీ ప‌రంగా కీల‌క నియామ‌కాల‌న్నీ మంగ‌ళ‌వారం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. జిల్లాల‌కు ఇంచార్జీ మంత్రుల‌ను ప్ర‌క‌టిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేయ‌గా… ఆ త‌ర్వాత రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల‌కు పార్టీ అధ్య‌క్షుల‌ను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణ‌యం తీసుకుంది.

వీరిలో 10 మంది తాజా మాజీ మంత్రుల‌కు చోటు ద‌క్కింది. అంతకుముందే… రాష్ట్రంలోని 26 జిల్లాల‌ను 9 రీజియ‌న్లుగా విభ‌జించిన పార్టీ… వాటికి 11 మంది రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్లను నియ‌మించింది. జిల్లాల‌కు పార్టీ అధ్య‌క్షుల జాబితా ఈ కింది విధంగా ఉంది.

అనంత‌పురం జిల్లా… కాపు రామ‌చంద్రారెడ్డి
అన్న‌మ‌య్య జిల్లా… గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి
క‌ర్నూలు జిల్లా… వై బాల‌నాగిరెడ్డి
నంద్యాల జిల్లా… కాట‌సాని రాంభూపాల్ రెడ్డి
చిత్తూరు జిల్లా… కేఆర్‌జే భ‌ర‌త్‌
క‌డ‌ప జిల్లా…  సురేశ్ బాబు
తిరుప‌తి జిల్లా… చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి
నెల్లూరు జిల్లా… వేమిరెడ్డి ప్ర‌భాకర్ రెడ్డి
బాప‌ట్ల జిల్లా… మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌
ప్ర‌కాశం జిల్లా… బుర్రా మ‌ధుసూద‌న యాద‌వ్‌
కాకినాడ జిల్లా… కుర‌సాల క‌న్న‌బాబు
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా… చెర‌కువాడ శ్రీరంగ‌నాథ రాజు
ఏలూరు జిల్లా… ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని)
కోన‌సీమ జిల్లా… పొన్నాడ వెంక‌ట స‌తీష్‌
అన‌కాప‌ల్లి జిల్లా… క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ
విశాఖప‌ట్నం జిల్లా… ముత్తంశెట్టి శ్రీనివాస‌రావు
అల్లూరి జిల్లా… భాగ్య‌ల‌క్ష్మి
పార్వ‌తీపురం జిల్లా… పాముల పుష్ప శ్రీవాణి
విజ‌య‌న‌గ‌రం జిల్లా… శ్రీనివాసరావు
శ్రీకాకుళం జిల్లా… ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌
స‌త్య‌సాయి జిల్లా… శంక‌ర నారాయ‌ణ‌
గుంటూరు జిల్లా…. మేక‌తోటి సుచ‌రిత‌
ప‌ల్నాడు జిల్లా… పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి
ఎన్టీఆర్ జిల్లా… వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు
కృష్ణా జిల్లా… పేర్ని వెంక‌ట్రామ‌య్య (పేర్ని నాని)
తూర్పు గోదావ‌రి జిల్లా… జ‌క్కంపూడి రాజా

వైసీపీలో రీజ‌నల్ కో ఆర్డినేట‌ర్ల నియామ‌కం.. 11 మందికి కొత్త బాధ్య‌త‌లు

  • అనుబంధ విభాగాల ఇంచార్జీగా విజయసాయిరెడ్డి
  • ముగ్గురు మంత్రులు, ముగ్గురు తాజా మాజీ మంత్రుల‌కు చోటు
  • స‌జ్జ‌ల‌, వైవీల‌కు కూడా రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్లుగా బాధ్య‌త‌లు

ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్సీపీలో రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్ల పేరిట 11 మంది నేత‌ల‌కు కొత్త బాధ్య‌త‌లు ప్ర‌క‌టించారు. మొత్తం 11 మంది నేత‌ల‌ను రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్లుగా నియ‌మించిన పార్టీ అధిష్ఠానం ఈ మేర‌కు మంగ‌ళ‌వారం నాడు ఉత్త‌ర్వులు జారీ చేసింది. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో ఉన్న పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డిని అన్ని అనుబంధ విభాగాల ఇంచార్జీగా నియ‌మించిన పార్టీ అధిష్ఠానం.. ఆయ‌న‌కు రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్‌గా మాత్రం అవ‌కాశం ఇవ్వ‌లేదు.

ఇక రీజ‌నల్ కో ఆర్డినేట‌ర్లుగా ప‌ద‌వులు ద‌క్కిన వారిలో ముగ్గురు మంత్రులు ఉండ‌గా, ఇటీవ‌లే మంత్రి ప‌ద‌వులు కోల్పోయిన తాజా మాజీ మంత్రులు ముగ్గురికి చోటు ద‌క్కింది. 11 మంది రీజ‌న‌ల్ కో ఆర్డినేటర్లు వారికి ద‌క్కిన జిల్లాల బాధ్య‌త‌లు కింది విధంగా ఉన్నాయి.

విశాఖ‌, అన‌కాప‌ల్లి, అల్లూరి జిల్లాలు… వైవీ సుబ్బారెడ్డి
చిత్తూరు, అనంత‌పురం, స‌త్య‌సాయి, అన్న‌మ‌య్య జిల్లాలు… పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి
క‌ర్నూలు, నంద్యాల జిల్లాలు… స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, బుగ్గ‌న రాజేంద్రనాథ్ రెడ్డి
క‌డ‌ప‌, తిరుప‌తి జిల్లాలు… అనిల్ కుమార్ యాద‌వ్‌
నెల్లూరు, ప్ర‌కాశం, బాప‌ట్ల జిల్లాలు… బాలినేని శ్రీనివాస‌రెడ్డి
ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలు… మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌
గుంటూరు, ప‌ల్నాడు జిల్లాలు… కొడాలి నాని
ఉభ‌య గోదావ‌రి, కాకినాడ, ఏలూరు, కోన‌సీమ‌ జిల్లాలు… పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌
పార్వ‌తీపురం, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాలు… బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

Related posts

నా సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ చేయడం తప్పే: మేకపాటి రాజమోహన్ రెడ్డి…

Drukpadam

రాష్ట్రపతి పదవికి… మీకో దండం నేను పోటీచేయను అంటున్న గోపాలకృష్ణ !

Drukpadam

వైసీపీ నేతల దూషణలను ఆహ్వానిస్తున్నా: పవన్ కల్యాణ్

Drukpadam

Leave a Comment