Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సాయి గణేష్ కుటుంబసభ్యులకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఫోన్ లో పరామర్శ…

సాయి గణేష్ కుటుంబసభ్యులకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఫోన్ లో పరామర్శ…
-దోషులను శిక్షించేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్న అమిత్ షా
-అమిత్ షా ను కుటుంసభ్యుల తో మాట్లాడించిన బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి
-గణేష్ ఆత్మహత్య కేసు సమగ్ర విచారణ జరిపిస్తామన్న అమిత్ షా
-కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హామీ

బీజేపీ మజ్దూర్ సంఘనాయకుడు సామినేని సాయి గణేష్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించి దోషులకు శిక్ష పడేలా చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా స్వయంగా కుటుంబసభ్యులకు హామీ ఇవ్వడం సంచలనంగా మారింది. ఖమ్మంలో పోలిసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని, మంత్రి అజయ్ , స్థానిక కార్పొరేటర్ భర్త ప్రసన్నల ప్రోద్బలంతోనే పోలీసులు వేధించారని , అతనిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బీజేపీ , టీఆర్ యస్ లు పెద్ద ఎత్తున విమర్శలు ప్రతి విమర్శలు గుప్పించుకుంటున్నాయి.

ఈ రోజు బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి సాయి గణేష్ నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు ఫోన్ చేశారు . వెంటనే రెస్పాండ్ అయినా కేంద్ర హోమ్ మంత్రి సాయి గణేష్ కుటుంబసభ్యులతో మాట్లాడారు . కేసు సమగ్ర విచారణ జరిపించి దోషులు ఎంతటివారైనా శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు . అంతే కాకుండా కుటుంబసభ్యులను ఆదుకుంటామని కేంద్ర మంత్రి భరోసా ఇవ్వడం చర్చనీయాంశం అయింది.

రేపు గవర్నర్ అపాయింట్మెంట్ …

సాయి గణేష్ ఆత్మహత్య కేసును సిబిఐ తో విచారణ జరిపించాలని కోరుతూ రేపు గవర్నర్ ను కలిసేందుకు బీజేపీ నాయకులూ ఆపాయిట్మెంట్ తీసుకున్నారు. ఖమ్మం నుంచి కూడా బీజేపీ నేతలు హైదరాబాద్ వెళ్ల నున్నారు .

సాయి చౌదరి డి ముమ్మాటికీ ఆత్మహత్య కాదు హత్యే …పొంగులేటి సుధాకర్ రెడ్డి

సాయి చౌదరి ది ఆత్మహత్య కాదని ముమ్మాటికీ టీఆర్ యస్ మరియు పోలీసులు కలసి చేసిన హత్య గా భావించాలని బీజేపీ జాతీయ నాయకుడు బీజేపీ తమిళనాడు సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.సాయి కుటుంబం ను పరామర్శించి సాయి అమ్మమ్మ సావిత్రమ్మ చెల్లెలు కావేరిని ఓదార్చారు .సాయి ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సాయి తన మరణానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రసన్న కృష్ణ కారణం అని మీడియా కు చెప్పినా పోలీసులు ఎందుకు నిందితుల పై కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. మృతుని కుటుంబానికి పైసలు ఆశ చూపి కేసు వాపసు తీసుకోవాలని ప్రలోభాలు పెట్టడం వారి దిగజారుడు తనం చూపిస్తున్నదని అన్నారు.అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పోన్ లో విషయాన్ని వివరించిన సుధాకర్ రెడ్డి సాయి కుటుంబ సభ్యులతో అమిత్ షా తో మాట్లాడించారు.వారితో మాట్లాడిన అమిత్ షా అండగా ఉంటామని చెప్పారు.ఈ సందర్భంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి సావిత్రమ్మ కు తక్షణ సహాయం గా లక్ష రూపాయలు అందచేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంగల సత్యనారాయణ బీజేపీ జిల్లాప్రధాన కార్యదర్శి లు నున్న రవి,రుద్రప్రదీప్, శ్యాం రాథోడ్, కొనతం లక్ష్మీ నారాయణ గుప్తా ఎర్నేని రామారావు వేల్పుల సుధాకర్ వీరు గౌడ్ అంకతి పాపా రావు,వట్టి కొండ శ్రీనివాస్, మంద సరస్వతి,ఆనంతు ఉపేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Related posts

భారత సమగ్రతను ప్రశ్నించే శక్తులతో రాహుల్ కు సంబంధాలా?: బీజేపీ

Drukpadam

రేషన్ దుకాణం దగ్గర ప్రధాని ఫోటో లేకపోవడంపై కేంద్ర ఆర్ధికమంత్రి ఆగ్రహం !

Drukpadam

ఈటలపై మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు…

Drukpadam

Leave a Comment