Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎల్లుండి ఖమ్మం కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి …

ఖమ్మం కు  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
రాహుల్ వరంగల్ సభ ప్రజల సమీకరణకు ఏర్పాట్లునాయకులతో సమీక్ష
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సై గణేష్ కుటుంబాన్ని పరామర్శించే అవకాశం
రేణుక చౌదరి కూడా వచ్చే అవకాశం
రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ ఏర్పాట్లు

టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి శుక్రవారం ఖమ్మం రానున్నారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. సడన్ గా రేవంత్ ఖమ్మం రాకపై అటు పోలీస్ వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి. ఫైర్ బ్రాండ్ గా పేరొందిన రేవంత్ తో కలిసి మరో ఫైర్ బ్రాండ్ , ఖమ్మం జిల్లా ఆడపడుచు , మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి కూడా వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెల 6 వ తేదీన వరంగల్ కు ఏఐసీసీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ వస్తున్నారు . అక్కడ పెద్ద భావిరంగా సభను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయిన తరువాత రాహుల్ గాంధీ మొదటిసారిగా రాష్ట్రానికి వస్తున్నందున జన సమీకరణ భారీగా చేయాలనే యోచనలో కాంగ్రెస్ ఉంది. అందులో భాగంగా వరంగల్ కు దగ్గరలో ఉన్న ఖమ్మం ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి ప్రజల సమీకరణ భారీగా ఉండాలనే ఉద్దేశంతో రేవంత్ వస్తున్నట్లు సమాచారం . సీఎల్పీ నేత భట్టి కూడా ఖమ్మం జిల్లాలోనే ఉన్నారు .ప్రస్తుతం అయన పీపుల్స్ మార్చ్ పేరుతొ మధిర నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు . రేవంత్ వస్తున్న సందర్భంగా ఆయన తన పాదయాత్ర ఒకపూట ఆపి ఖమ్మం వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

నాయకులు ఖమ్మంలో ముఖ్యనేతలతో సమావేశం అవుతారు . ఇదే సందర్భం లో ఇటీవల పోలిసుల వేధింపులతో ఆత్మహత్యకు గురైన బీజేపీ నేత సామినేని సాయి గణేష్ కుటుంబాన్ని కూడా వారు పరామర్శించే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు చేసేందుకు సిద్ధమౌతున్నారు. సాయి గణేష్ మంత్రి పువ్వాడ ,స్థానిక కార్పొరేటర్ భర్త ప్రసన్న ల వత్తిడి మేరకు పోలీసులు కేసులు పెట్టి వేధించారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే రేవంత్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారా లేదా అనేది కాంగ్రెస్ వర్గాలు నిర్దారించలేదు ….

Related posts

మంత్రి జయరాం భార్య కొనుగోలు చేసిన భూములను అటాచ్ చేసిన ఐటీ శాఖ!

Drukpadam

సింగర్ అవతారమెత్తిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్!

Drukpadam

ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెయిల్.. షరతులు విధించిన హైకోర్టు!

Drukpadam

Leave a Comment