Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

మాస్క్ త‌ప్ప‌నిస‌రి,.. లేకుంటే రూ.1,000 జ‌రిమానా!: తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్ట‌ర్

మాస్క్ త‌ప్ప‌నిస‌రి,.. లేకుంటే రూ.1,000 జ‌రిమానా!: తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్ట‌ర్
మళ్లీ మాస్క్ నిబంధ‌న‌ను తీసుకొచ్చిన తెలంగాణ‌
కేసులు పెర‌గ‌కున్నా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గానే నిబంధ‌న‌
ఫంక్ష‌న్లు, ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు తప్ప‌నిస‌రన్న ఆరోగ్య శాఖ డైరెక్ట‌ర్

దేశ రాజధాని ఢిల్లీ స‌హా ప‌లు రాష్ట్రాల్లో మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ స‌ర్కారు కూడా అప్ర‌మ‌త్త‌మైంది. రాష్ట్రంలో కొత్త‌గా న‌మోదవుతున్న కేసుల్లో ఏమాత్రం పెరుగుద‌ల లేకున్నా కూడా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా మాస్క్ ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్భంగా తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “తెలంగాణ‌లో క‌రోనా ఫోర్త్ వేవ్‌కు అవ‌కాశం లేదు. రాష్ట్రంలో రోజుకు 20 నుంచి 25 కేసులు న‌మోద‌వుతున్నాయి. ప్ర‌జ‌ల్లో 93 శాతం యాంటీబాడీస్‌ను గుర్తించాం. థ‌ర్డ్ వేవ్‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొన్నాం. అయినా కూడా ఫంక్ష‌న్లు, ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు తప్ప‌నిస‌రిగా పాటించాల్సిందే. మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా వినియోగించాలి. మాస్క్ లేకుంటే రూ.1,000 జ‌రిమానా విధించడం జరుగుతుంది” అని ప్ర‌క‌టించారు.

ప్రపంచంలో కూడా అనేక దేశాల్లో తిరిగి మాస్క్ మస్ట్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా మాస్క్ తప్పనిసరి చేస్తూ , ఉత్తర్వులు వెలువడ్డాయి. మాస్క్ పెట్టుకోకుండా బయటకు వస్తే 500 ఫైన్ వేయనున్నట్లు ఢిల్లీ సర్కార్ తెలిపింది.

Related posts

ఆస్ట్రేలియాలో లాక్‌డౌన్‌ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకం.. 250 మంది అరెస్ట్!

Drukpadam

సరదా సందేశాల కారణంగా కొందరి ప్రాణాలు పోతున్నాయి: నెటిజన్లపై రేణు దేశాయ్ ఆగ్రహం

Drukpadam

ఏపీలో కరోనా కేసుల్లో భారీగా తగ్గుదల…

Drukpadam

Leave a Comment