Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అత్యాచార బాధితురాలి స‌మ‌క్షంలోనే వాదులాడుకున్న‌ చంద్ర‌బాబు, వాసిరెడ్డి ప‌ద్మ

అత్యాచార బాధితురాలి స‌మ‌క్షంలోనే వాదులాడుకున్న‌ చంద్ర‌బాబు, వాసిరెడ్డి ప‌ద్మ

  • విజ‌య‌వాడ ఆసుప‌త్రిలో ఘ‌ట‌న‌
  • అత్యాచార బాధితురాలి ప‌రామ‌ర్శ‌కు వ‌చ్చిన వాసిరెడ్డి
  • అదే స‌మ‌యంలో అక్క‌డ‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు
  • ఇరువురు నేత‌ల మ‌ధ్య వాగ్వాదం
  • టీడీపీ నేత పంచుమ‌ర్తి అనురాధ ఎంట్రీతో వాగ్యుద్ధం

ఏపీ విప‌క్ష నేత నారా చంద్ర‌బాబునాయుడు, ఏపీ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ‌ల మ‌ధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం చోటుచేసుకుంది. అత్య‌చార బాధితురాలు, ఆమె త‌ల్లి స‌మ‌క్షంలోనే వీరిద్ద‌రూ ఒక‌రిపై మ‌రొక‌రు కేక‌లు వేసుకున్నారు. ఈ పరిణామంతో, ఓదార్పు ద‌క్కాల్సిన అత్యాచార బాధితురాలు, ఆమె త‌ల్లి దిక్కులు చూస్తూ నిల‌బ‌డిపోయారు.

విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ప‌రామ‌ర్శించేందుకు వాసిరెడ్డి ప‌ద్మ రాగా… అప్ప‌టికే అక్క‌డికి చంద్ర‌బాబు వ‌స్తున్నార‌న్న స‌మాచారంతో ఆసుప‌త్రికి చేరుకున్న టీడీపీ శ్రేణులు ఆమెకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

ఎలాగోలా వారిని దాటుకుని వాసిరెడ్డి ప‌ద్మ లోపలికి వెళ్ల‌గా… ఆమె తిరుగు ప‌య‌నం కాక‌ముందే అక్క‌డికి చంద్ర‌బాబు వచ్చారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో ఇంత దారుణాలు జ‌రుగుతుంటే ఏం చేస్తున్నార‌ని వాసిరెడ్డిని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. తాము కూడా బాధితుల‌కు అండ‌గా నిలుస్తున్నామ‌ని, నేరాల కట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పద్మ బ‌దులిచ్చారు.

ఇలా చంద్ర‌బాబు.. వాసిరెడ్డి ప‌ద్మ‌ల మ‌ధ్య వాగ్వాదం జ‌రుగుతుండ‌గా.. అక్క‌డికి టీడీపీ నాయకురాలు పంచుమ‌ర్తి అనురాధ చేరుకున్నారు. అక్క‌డికి వ‌చ్చిన వెంట‌నే పంచుమ‌ర్తి అనురాధ… వాసిరెడ్డి ప‌ద్మ‌పై విరుచుకుప‌డ్డారు. ఈ సంంద‌ర్భంగా ఇద్ద‌రు మ‌హిళా నేత‌లు ఒక‌రిపై ఒక‌రు వేళ్లు చూపించుకుంటూ వాదులాట‌కు దిగారు.

ప‌రిస్థితి చేయి దాటిపోతోంద‌ని భావించిన చంద్ర‌బాబు… అనురాధను సంయ‌మనం పాటించాలంటూ సూచించారు. ఆ త‌ర్వాత ఆసుప‌త్రి బ‌య‌ట‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడి వెళ్లారు. ఆ త‌ర్వాత వాసిరెడ్డి ప‌ద్మ కూడా మీడియాతో మాట్లాడుతూ త‌న‌పై వాగ్యుద్ధానికి దిగిన చంద్ర‌బాబుతో పాటు త‌న‌ను అడ్డుకున్న బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావుపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

Related posts

ఖమ్మం జిల్లాపై కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ … ఇటీవల తుమ్మల తో భేటీ పై జిల్లాలో ఉత్కంఠత …

Drukpadam

ప్రధాని తప్ప మిగతా నేతలకు కేసీఆర్ టార్గెట్ !వ్యూహాత్మకంగా ప్రధాని ప్రసంగం

Drukpadam

తాలిబాన్లకు గట్టి మద్దతు దారులుగా చైనా ,పాక్!

Drukpadam

Leave a Comment