Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎపిలో బస్సుకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

  • చింతూరు మండలం కొత్తూరు వద్ద ఘటన
  • ఒడిశా నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు
  • ప్రయాణికులను కిందికి దింపి బస్సుకు నిప్పు పెట్టిన వైనం

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చింతూరు మండలం కొత్తూరు వద్ద గత రాత్రి ఓ బస్సుకు నిప్పు పెట్టారు. ఒడిశా నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సును ఆపిన మావోలు.. ప్రయాణికులను కిందికి దింపారు. అనంతరం బస్సుకు నిప్పు పెట్టారు. దండకారణ్యం బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

బస్సుకు నిప్పు పెట్టడం అది పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనతో పోలీసులు అలెర్టయ్యారు. గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న చింతూరు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కపడేలా చేశాయి.

Related posts

మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ పర్యాటకులకు ద్వారాలు తెరుస్తున్న చైనా!

Drukpadam

ఆనంద్ మహీంద్రా మనసు దోచిన ఈ చిన్ని గిరిజన గ్రామం !

Drukpadam

ఐజేయి కృషి ఫలితంగా జర్నలిస్టులకు రైల్యేపాస్ ల జారీ ప్రారంభం

Drukpadam

Leave a Comment