Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సీఎల్పీ నేత భట్టి …మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి మధ్య వార్

సీఎల్పీ నేత భట్టి …మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి మధ్య వార్
-ఇది ఎటు దారితీస్తుందో అని కార్యకర్తల ఆందోళన
-నాయకులమధ్య ఐక్యత లేకపోతె అందరి పుట్టిమునగడం కాయం అంటున్న పరిశీలకులు
-వచ్చే ఎన్నికల్లో అనుకూలంగా ఉన్న వాతావరణం చెడగొట్టుకునే దిశగా పోరు
-అయోమయంలో కార్యకర్తలు,నాయకులు

అసలే కాంగ్రెస్ బలహీనపడిన వేళ కాస్తో కూస్తో కాంగ్రెస్ బలంగా ఉన్నదని భావిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చిన అవకాశాన్ని కాలదన్నేలా ఉన్నది పార్టీలోని ఆధిపత్య పోరు … ఖమ్మం కాంగ్రెస్ అంటేనే ఆధిపత్య పోరుకు చిరునామాగా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తరవాత వరంగల్ లో మే 6 న జరప తలపెట్టిన రైతు సంఘర్షణ సభకు జనసమీకరణ కోసం మొదటిసారి జిల్లాకు వచ్చారు .ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ముందే ఇరు వర్గాలు గొడవలకు దిగటం ఒకరిపై మరొకరి సవాళ్లు ప్రతిసవాళ్లు విసురు కోవడం తోపులాటలు కాంగ్రెస్ సంస్కృతిని ప్రతిబింబించాయి. వీళ్లకు బుద్దిరాదనే అభిప్రాయాలు అనుకునేలా చేశాయి. ఇదే మా బలం అని కాంగ్రెస్ నేతలు చెప్పొకోవచ్చుగాక అది ఒకప్పటి పరిస్థితి ,నాడు కేంద్రంలో ,రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమి చేసిన చెల్లు బాటు అయ్యేది .కానీ నేడు పరిస్థితులు పూర్తీ భిన్నంగా ఉన్నాయి. కాంగ్రెస్ లో నాయకులమధ్య తన్నులాట పై అధికార టీఆర్ యస్ , బీజేపీ పార్టీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. అదితెలిసిన వీరిలో మార్పు రావడంలేదు . ఒకరు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారనే విమర్శలు ఉండగా , మరొకరు ఎన్నికల్లో పోటీచేయడం ఆతరవాత జిల్లాలో కార్యకర్తలను పట్టించుకోకపోవడం జిల్లా మొఖం చూడక పోవడంపై కార్యకర్తల్లో అసహనం , అసంతృపి , కోపం నెలకొన్నది …జిల్లాలో మంచి వాతావరణాన్ని నేతలు పంతాలు , పట్టింపులతో చెడగొడుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత ఉమ్మడి జిల్లాలో 2014 ,2018 ఎన్నికల్లో రాష్ట్రమంతా టీఆర్ యస్ గాలివీచినా, ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ కూటమిని ప్రజలు ఆదరించారు . రేపు 2023 ఎన్నికల్లో కూడా అదే వరవడి ఉండవచ్చునని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్న వేళ కాంగ్రెస్ లో అంతర్గత పోరు పార్టీని మరింత బలహీనపరిచేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఇటు సీఎల్పీ నేత భట్టి , అటు మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఇద్దరు నేతలు రెండు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు . సీఎల్పీ నేత భట్టి కేవలం మధిరలో మాత్రమే రాజకీయాలు చేస్తారని , మిగతా జిల్లా ను పట్టించుకోరని విమర్శలు ఉన్నాయి. దానికి తగ్గుట్లు గానే భట్టి మధిర లో తరుచు పర్యటనలు చేటు ప్రజలను కలుసుకుంటున్నారు . ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను కలుసుకోవడంలో ఏమాత్రం తప్పులేదు ..కానీ రాష్ట్ర కాంగ్రెస్ లో ప్రముఖ నాయకుడిగా ఉన్న భట్టి తన స్థాయికి తగ్గట్లుగా జిల్లాను వోన్ చేసుకోవడంలేదనే అభిప్రాయాలు గట్టిగా ఉన్నాయి.

ఇక మాజీ కేంద్ర మంత్రి దేశంలో పరిచయం అక్కర్లేని ఫైర్ బ్రాండ్ గా పేరున్న రేణుక చౌదరి కూడా ఎన్నికల సందర్భంలో తప్ప మిగతా సమయాల్లో జిల్లాకు రాకపోవడంపై విమర్శలు ఉన్నాయి. జిల్లాకు ఆడపడుచునని చెప్పుకొనే రేణుక చౌదరి విజిటింగ్ ప్రొఫెసర్ గా జిల్లాకు వస్తు కాంగ్రెస్ లో కయ్యాలకు కారణమౌతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో గాని,గ్రామపంచాయతీ , మండల పరిషత్ , జిల్లా పరిషత్ ,ఎన్నికల సందర్భంగా పార్టీ తరుపున పోటీచేసిన వాళ్లకు మద్దతుగా ఎక్కడ ఆమె ప్రచారం చేయడంగాని పోటీచేసే వారికీ అండదండలు ఇవ్వడం గాని చేయకుండా కేవలం ఆమె ఎన్నికలప్పుడు వచ్చి పోవడం పై కొందరు కార్యకర్తలు మండిపడుతున్నారు .

గతంలోనూ రేణుకాచౌదరికి మొదట జలగం ప్రసాద్ తోనూ , తరవాత మాజీమంత్రి సంభానీతోను ,అటు తరువాత దివంగత నేత రామిరెడ్డి వెంకటరెడ్డి తోనూ విభేదాలు ఉన్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకున్నారు . ఆమె తనకు ఉన్న పలుకుబడి పేరుకు తగ్గట్లుగా జిల్లాకు ఉపయోగపడలేదని , ఎంతసేపటికి నాయకులతో తగాదాలతోనే కాలం గడిపారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నాయకుల మధ్య ఐక్యత లేకుండా జిల్లాలో 10 కి 10 సీట్లు గెలుస్తామని చెప్పడం అత్యాశే అవుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు . ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకుల ఐక్యతతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని లేకపోతె అందరి పుట్టి మునగడం ఖాయమని రాజకీయ పండితుల అభిప్రాయం …..

 

Related posts

వంటగదిలో నిధి… తవ్విచూస్తే రూ.2.3 కోట్ల విలువైన బంగారు నాణేలు!

Drukpadam

Three BRS candidates elected unopposed to Telangana Council

Drukpadam

తూర్పు గోదావరి జిల్లాలో కింగ్ కోబ్రా కలకలం… ఎంత పెద్దదో!

Drukpadam

Leave a Comment