Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాష్ట్రపతి వద్దే వద్దు …ప్రధాని పదవే ముద్దు ముద్దు …. మాయావతి!

రాష్ట్రపతి వద్దే వద్దు …ప్రధాని పదవే ముద్దు ముద్దు …. మాయావతి!
-నా మద్దతుదారులు తలుచుకుంటే నన్ను ప్రధానమంత్రిని చేయగలరు
-ఇటీవల యూపీ ఎన్నికల్లో బీఎస్పీకి ఘోర పరాభవం
-వివిధ వర్గాలు కలిసొస్తే ప్రధాని అవుతానని వెల్లడి
-దళితుల అభ్యున్నతే లక్ష్యమని ఉద్ఘాటన

మాయావతి బీఎస్పీ అధినేత్రి ఒకప్పుడు దేశంలోనే పెద్దరాష్ట్రమైన యూపీ కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇటీవల ఆరాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటులో గెలిచి ఘోరపరాభవం మూటగట్టుకున్నారు . అయినప్పటికీ ఆమెను బీజేపీ రాష్ట్రపతిగా చేసేందుకు హామీ ఇచ్చిందని అందువల్ల శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి ఆమె సహకరించిందనే అభియోగాలు ఉన్నాయి. వాటికీ తగ్గట్లుగానే ఆమెపై వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యం ఆమె స్పందించారు . జరుగుతున్న ప్రచారం లో ఏమాత్రం నిజం లేదని ఖండిస్తున్నారు . తాను యూపీ ముఖ్యమంత్రి కావాలనేది తనమొదటి కోరిక అని తరవాత ప్రధాని పదవి చేపడతానని అంటున్నారు . తమ కార్యకర్తలు బడుగు బలహీనవర్గాలు తలచుకుంటే అదేమంత పెద్ద కష్టం కాదని అంటున్నారు . అందువల్ల రాష్ట్రపతి పదవి వద్దే వద్దు …ప్రధాని పదవే ముద్దు …ముద్దు అంటూ మాయావతి చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయాలు ఎదురైనప్పటికీ తమకు బలమైన క్యాడర్ ఉందని బీఎస్పీ చీఫ్ మాయావతి అంటున్నారు. తన మద్దతుదారులు తలుచుకుంటే తనను ప్రధానమంత్రిని చేయగలరని పేర్కొన్నారు. దళితులు, ముస్లింలు, ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారు ఏకతాటిపై నడిస్తే తాను ప్రధాని అవడం తథ్యమని అన్నారు. ఆయా వర్గాల్లో తన మద్దతుదారులు ఉన్నారని, వారికి తనను ప్రధానిని చేసే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని మాయావతి అభిప్రాయపడ్డారు.

అయితే, భారత రాష్ట్రపతి కావాలన్న ఆలోచన తనకు ఎప్పుడూ లేదని, తాను రాష్ట్రపతి కావాలనుకుంటున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని ఆమె స్పష్టం చేశారు. తన వరకు ఉత్తరప్రదేశ్ లో గెలిచి తిరిగి అధికారంలోకి రావడం, ఆపై ప్రధాని కావడం గురించి ఆలోచిస్తానేమో కానీ, రాష్ట్రపతి కావాలని మాత్రం ఎన్నడూ కోరుకోనని ఉద్ఘాటించారు.

తాను రాజకీయాల్లోకి వచ్చింది విలాసవంతమైన జీవితం కోసం కాదని, దళిత ఐకాన్ బీఆర్ అంబేద్కర్, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ ల ఆశయస్ఫూర్తిని కొనసాగించడం కోసమని మాయావతి చెప్పారు. దళితుల సాధికారతే తన లక్ష్యమని వెల్లడించారు. అయితే ముఖ్యమంత్రినో, ప్రధానమంత్రినో అయితేనే తన లక్ష్యాన్ని సాధించగలనని అభిప్రాయపడ్డారు.

Related posts

అసెంబ్లీ నుంచి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సస్పెన్షన్..

Drukpadam

పాలేరులో సిపిఎం ,కొత్తగూడెంలో సిపిఐ పొటిఖాయమేనా…!

Drukpadam

రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ లకు రాహుల్ ఫోన్ …సాగర్ పై ఆరా ?

Drukpadam

Leave a Comment