Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అన్నకు షర్మిలకు బాసట … కేటీఆర్ మాటలపై విమర్శల జల్లు!

అన్నకు షర్మిలకు బాసట … కేటీఆర్ మాటలపై విమర్శల జల్లు!
నీ సంగతి చూసుకోకుండా పక్కరాష్ట్రాల్లో వేలు పెట్టటం ఎందుకు
కేటీఆర్ ను కడిగేసిన షర్మిల …
తెలంగాణ‌లో కేటీఆర్‌కి ఫ్రెండ్స్ లేరట: ష‌ర్మిల‌
మ‌న‌మే స‌రిగ్గా లేన‌ప్పుడు ప‌క్క వారి మీద ప‌డి ఏడిస్తే ఏం లాభ‌మన్న ష‌ర్మిల‌
తెలంగాణ ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్
కేటీఆర్ కు తెలంగాణలో సమస్యలు కనిపించలేదా? అని ప్ర‌శ్న‌
తెలంగాణలో ఫ్రెండ్స్ ఉంటే ప్రజల సమస్యలు తెలిసేవని చుర‌క‌

ఏపీ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రంగా ధ్వజం ఎత్తారు . నేడు ఏపీ సీఎం జగన్ చెల్లి షర్మిల కూడా అన్నకు బాసటగా నిలిచారు . కేటీఆర్ కు పక్క రాష్ట్రాల్లో ఫ్రెండ్స్ ఉన్నారట గాని తెలంగాణాలో లేదా అని ప్రశ్నించారు . ఇక్కడ సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన కేసీఆర్ ,కేటీఆర్ లు పక్క రాష్ట్రాలపై పడి ఏడవటం ఏమిటిఅని అన్నారు . ముందు తెలంగాణాలో నిరుద్యోగులు,రైతుల సమస్యలపై ఏమి చేశారని పక్క రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారని ఎదురు దాడి చేశారు .

మ‌న‌మే స‌రిగ్గా లేన‌ప్పుడు ప‌క్క వారి మీద ప‌డి ఏడిస్తే ఏం లాభ‌మని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆమె మాట్లాడుతూ… కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని ఆమె డిమాండ్ చేశారు. కేటీఆర్ నీకు తెలంగాణలో సమస్యలు కనిపించలేదా? అని ఆమె ప్ర‌శ్నించారు.

తెలంగాణలో ఫ్రెండ్స్ ఉంటే ప్రజల సమస్యలు తెలిసేవని ఆమె అన్నారు. ఆంధ్ర‌లోనే చిన్న దొర కేటీఆర్‌కు ఫ్రెండ్స్ ఉన్నార‌ట అని ఆమె ఎద్దేవా చేశారు. తెలంగాణ‌లో కేటీఆర్‌కి ఫ్రెండ్స్ లేరని ఆమె అన్నారు. పక్క రాష్ట్రంపై దుమ్మెత్తిపోసే ముందు మన రాష్ట్రం ఎలా ఉందో చూసుకోవాలని ఆమె అన్నారు. తెలంగాణ ప్ర‌జ‌లు ఏం సంతోషంగా ఉన్నార‌ని ఆమె నిల‌దీశారు. తెలంగాణ‌లోనే ప‌రిస్థితులు బాగోలేక‌పోతే ఇప్పుడు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ దేశాన్ని ఏల‌తామ‌ని చెప్పుకుంటున్నార‌ని ఆమె విమ‌ర్శించారు.

Related posts

ఈ నెల 21 న ఖమ్మం నేతలతో షర్మిల సమావేశం

Drukpadam

50 రోజుల్లో 5 రాష్ట్రాలు… 50వ రోజు 26 కిలోమీటర్లు నడిచిన రాహుల్!

Drukpadam

ఫైటర్ షర్మిల పద్మవ్యూహంలో చిక్కుకున్నారా ?

Drukpadam

Leave a Comment