Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పీకే పై అభ్యంతరాలను తాను పట్టించుకోలేదన్న మమతా బెనర్జీ!

పీకే పై అభ్యంతరాలను తాను పట్టించుకోలేదన్న మమతా బెనర్జీ!
-పీకేపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.. అయినా నేను ఆయనతో కలిసి వెళ్లడానికే మొగ్గుచూపానని వెల్లడి
-పీకేతో కలిసి పని చేస్తామన్న మమత
-ఆయన సైద్ధాంతిక నిబద్ధతపై తమ పార్టీలో కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని వ్యాఖ్య
-గత ఎన్నికల్లో మమత విజయం కోసం పని చేసిన పీకే

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై అనేకమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు . అయినప్పటికీ ఆయనతో కలిసి పనిచేసేందుకు తాను మొగ్గుచూపానని మమతా బెనర్జీ పేర్కొన్నారు . దేశవ్యాపితంగా ఎన్నికల నెట్ వర్క్ ఉంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరు ఏమిటి అనేది సమగ్ర అవగాహన కలిగిన ప్రశ్నత కిషోర్ కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల వ్యూహారం రచించబోతున్నారని , కాంగ్రెస్ లో చేరబోతున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ తో బెడిసి కొట్టిన విషయం తెలిసిందే . ఈ సందర్భంగా మమతా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.

రాబోయే రోజుల్లో కూడా తాను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కలిసే పని చేస్తానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో తాను చేరబోవడం లేదంటూ ప్రశాంత్ కిశోర్ ప్రకటించిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రశాంత్ కిశోర్ సైద్ధాంతిక నిబద్ధతపై తమ పార్టీలోని కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారని… అయినా తాను ప్రశాంత్ కిశోర్ తో కలిసి ప్రయాణించడానికే మొగ్గు చూపానని తెలిపారు. పీకేకు ఇచ్చే బాధ్యతలపై తమ పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని… అయినప్పటికీ ఆయనతో కలిసి పని చేయాలని తాము నిర్ణయించామని చెప్పారు.

పీకేకు ఓ రాజకీయ సిద్ధాంతం లేదని కాంగ్రెస్ లోని పలువురు సీనియర్లు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. కానీ, పీకే విషయంలో సోనియాగాంధీ ముందుకే కదిలారు. అయినప్పటికీ తాను కాంగ్రెస్ లో చేరబోనని… కేవలం సలహాదారుడిగా మాత్రమే పని చేస్తానని పీకే చెప్పారు.

Related posts

ఏపీ లో కమలానికి కష్టాలేనా …?

Drukpadam

ఉద్యమ కేసుల ఎత్తివేతపై ముద్రగడ హర్షం: సీఎం జగన్ కు లేఖ!

Drukpadam

వ్యాక్సిన్ తయారీ ఆలస్యం అయితే మేము ఉరేసుకోవాలా కేంద్ర మంత్రి సదానంద గౌడ ఆశక్తి కార వ్యాఖ్యలు

Drukpadam

Leave a Comment