Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మోదీని ఓడించ‌డం పిల్ల‌ల ఆట కాదు: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే!

మోదీని ఓడించ‌డం పిల్ల‌ల ఆట కాదు: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే!
-కేసీఆర్ ను కలిసేందుకు హైద్రాబాద్ వచ్చానని వెల్లడి
-తెలంగాణకు తన మద్దతు ఎప్పడు ఉంటుందన్న కేంద్రమంత్రి
-ఫ్రంట్‌లు ఎవరైనా ఏర్పాటు చేయొచ్చ‌ని వ్యాఖ్య‌
-కేసీఆర్ త‌న‌కు మిత్రుడన్న అథవాలే

2024 ఎన్నికలకోసం రాజకీయ సమీకరణాలు ప్రారంభమయ్యాయి. బీజేపీ ఇందుకోసం ఎత్తులు వేస్తుంది. దేశంలోని ప్రతిపక్షాల బలాబలాను బేరీజు వేసుకుంటూ ఇప్పటివరకు తమకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న పార్టీలను బుజ్జగించే పనిలో పడింది . ప్రత్యేకించి దక్షిణాదిన బీజేపీ బలం అంతంత మాత్రమే ఉండటంతో ప్రాంతీయ పార్టీలను దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. తెలంగాణాలో కేసీఆర్ బీజేపీ కి కొరకరాని కొయ్యగా తయారు అయ్యారు. దేశమంతా తిరిగి బీజేపీ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కాలంలో బీజేపీ విధానాలను ఎండగట్టడంలో కేసీఆర్ ముందున్నారు. కేసీఆర్ తో తలనొప్పిగా ఉందని భావిస్తున్న బీజేపీ ఆయన్ను దారిలో పెట్టుకునేందుకు రామదాస్ వచ్చారా ? అనే సందేహాలు కూడా ఉన్నాయి. వారి మధ్య జరిగే చర్చల సారాంశం ఏమిటి అనేది వెల్లడి కాలేదు . కానీ ఒక కేంద్రమంత్రి ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ ను కలవడానికి రావడం రాజకీయవర్గాల్లో ఆశక్తిగా మారింది.

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి కేంద్ర మంత్రి, రిప‌బ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత రాందాస్ అథ‌వాలే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏను, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ఓడించ‌డం పిల్ల‌ల ఆటేమీ కాద‌ని ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

మోదీకి వ్య‌తిరేకంగా ఎంద‌రు నేత‌లు రావాల‌నుకుంటున్నారో రండి అంటూ వ్యాఖ్యానించిన అథ‌వాలే.. మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక‌రేను కేసీఆర్ క‌లిశారని, దానిపై ఎలాంటి అభ్యంత‌రం లేదన్నారు. ఫ్రంట్‌లు ఎవ‌రైనా ఏర్పాటు చేయొచ్చన్న కేంద్ర మంత్రి… తెలంగాణ‌కు స‌పోర్ట్‌గానే తాను ఇక్క‌డికి వ‌చ్చానన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం చేశారన్న అథ‌వాలే.. తెలంగాణ‌ సీఎం కేసీఆర్ త‌న‌కు స్నేహితుడన్నారు. ద‌ళితుల‌పై జ‌రుగుతున్న‌దాడుల‌ను అరిక‌ట్టాల్సి ఉంద‌న్న ఆయ‌న‌… ద‌ళితుల‌కు 5 ఎక‌రాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Related posts

సోనియా కర్ణాటకలో ఎన్నికల ప్రచారం పై మోడీ పరోక్ష వ్యాఖ్యలు ..

Drukpadam

ఇప్పుడు ఆస్తి పన్నులు పెంచడం ఏమిటి …ప్రజలు భాదల్లో ఉన్నారు: సీపీఐ రామకృష్ణ

Drukpadam

తాను నమ్మకున్న పార్టీ నిర్ణయంపైనే తన రాజకీయ ప్రయాణం ఆధారపడి ఉంటుంది …పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి!

Drukpadam

Leave a Comment