Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

యాదగిరి గుట్టపైకి వాహనంతో వెళ్లాలంటే రూ 500 పార్కింగ్ ఫీజు కట్టాలసిందే ….

యాదగిరి గుట్టపైకి వాహనంతో వెళ్లాలంటే రూ 500 పార్కింగ్ ఫీజు కట్టాలసిందే ….
సమయందాటితే మరో 100 వసూల్…పార్కింగ్ ఫీజు భారీ మొత్తం లో
యాదగిరిగుట్ట ఆలయ అధికారుల కీలక నిర్ణయం.
కొండపైకి వెళ్లే వాహనాలకు, భారీగా వసూళ్లకు సిద్ధమైన అధికారులు
భారీగా పార్కింగ్ ఫీజు పై విమర్శలు …. పార్కింగ్ ఫీజు నామినల్ గా ఉండాలంటున్న భక్తులు

యాదాద్రిదర్శనంకు పెద్దగా టికెట్స్ రేట్లు పెట్టని అధికారాలు వాహనంతో వెళ్లాలంటే … ప్రియం ….డబ్బులుంటేనే .కొండపైకి వాహనంతో వెళ్లాలంటే రూ 500 చెల్లించాల్సిందే …సమయం మించితే మరో 100 వసూల్ …ప్రకటించిన ఆలయ అధికారులు …

రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహస్వామి దేవాలయాన్ని సర్వాంగ సుదరంగా తీర్చి దిద్దేపనులు శరవేగంగా జరుగుతున్నాయి. తిరుమలకు దీటుగా తెలంగాణ రాష్ట్రంలో దీన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేసీఆర్ పట్టుదలతో పనులు చేయించారు.కొండపైన పార్కింగ్ ఫీజు మాత్రం భారీగా పెట్టడం విమర్శలకు దారితీస్తుంది. ఒక్క వాహనానికి 500 రూపాయల పార్కింగు ఫీజా! ఆమ్మో అంతనా? అంటూ గుండెలు బాదుకుంటున్నారు. దీన్ని తగ్గించకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సీఎం కేసీఆర్ మొదటినుంచి ప్రత్యేక పర్వేక్షణలో జరుగుతున్న పనులు పూర్తీ కావచ్చాయి. ఇప్పటికే ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలను అంత్యంత సుందరంగా తీర్చిదిద్దారు . ఇంకా గుడిచుట్టూ ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి. అయితే వాహనాలతో వచ్చిన భక్తులను పైకి వెళ్లనివ్వకుండా కింద పార్కింగ్ స్థలం ఏర్పాటుచేసి అక్కడ నుంచి టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఉచిత బస్సు లద్వారా భక్తులను కొండపైకి తీసుకొనిపోవడం రావడం జరుగుతుంది. ప్రత్యేక వాహనాల ద్వారా వచ్చిన భక్తులు తమవాహనాలను పైకి వెళ్లనివ్వకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు. దానితో పైకి వాహనాలు వెళ్లేలా ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే వాహనాలకు భారీగా ఫీజు పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

భక్తుల వాహనాలను పైకి వెళ్లనివ్వడంలేదు . దీంతో వాహనాల్లో వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు కొండపైకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం విఐపి ,వివిఐపి లు , మంత్రులు , ఎంపీలు , ఎమ్మెల్యేలు , అధికారులు వెళ్లేందుకు అనుమంతి ఇస్తున్న అధికారులు , మే 1 నుంచి కొండపైకి వాహనాలు అనుమతించాలని నిర్ణయించారు. కాకపోతే పార్కిన్ ఫీజు రూ 500 రూపాయలు పెట్టడంపై విమర్శలు ఉన్నాయి. అంతా రేటు పెట్టడం సరికాదని అంటున్నారు. దేవుడి దర్శనానికి కూడా అంతా ఫీజు లేదని ,పార్కింగ్ ఫీజు భారీగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం చెడ్డపేరు తెచ్చుకోవద్దని హితవు పలుకుతున్నారు.
ప్రోటోకాల్ ప్రకారం వీవీఐపీలు,వీఐపీలు,దేవస్థానానికి భారీ విరాళం ఇచ్చిన దాతలకు నిబంధనల నుంచి మినహాయింపు నిచ్చారు . కొండపై ఆర్టీసీ బస్తాండ్ పక్కన పార్కింగ్ స్థలం కేటాయించినట్లు అధికారులు తెలిపారు .

Related posts

శ్రీలంక నూతన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన రణిల్ విక్రమసింఘే…

Drukpadam

మీ నిబద్ధతతో తెలుగుజాతి సురక్షితం: న్యూజెర్సీ ‘మీట్ అండ్ గ్రీట్’లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ!

Drukpadam

అనుకున్న సమయానికే… భారత్ లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు!

Drukpadam

Leave a Comment