Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎర్రజెండా గొప్పతనాన్ని చాటిన మేడే ….కార్మికవాడల్లో పండుగవాతావరణం!

ఎర్రజెండా గొప్పతనాన్ని చాటిన మేడే ….కార్మికవాడల్లో పండుగవాతావరణం!
-ఒక్క కమ్యూనిస్టులేకాకుండా ,పార్టీలకు అతీతంగా వేడుకలు
-కార్మిక దినోత్సవాన్ని వేనోళ్ళ కీర్తించిన నేతలు
-ర్యాలీలు , సభలు ,సమావేశాలతో హోరెత్తిన రోజు
-ఇష్టం లేకపోయినా కార్మికుల మాటమాట్లాడాల్సిన రోజు

మే డే ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రపంచ వ్యాపితంగా కార్మికులు జరుపుకున్న పండగ …నాడు పని గంటల తగ్గింపు కోసం చికాగో లో జరిగిన పోరాటం ప్రపంచ కార్మికులకు ప్రేరణగా నిలిచింది. వాడవాడలా కార్మిక దినోత్సవం జరుపుకునే రోజుగా మే డే నిలిచింది. చికాగో నగరంలో పోలిసుల కాల్పుల్లో మరణించిన కార్మికుల రక్త తర్పణతో వెలిసిందే ఎర్రజెండా …నాటి నుంచి ఒక్క కమ్యూనిస్ట్ పార్టీలే వాటి కార్మిక సంఘాలే కాకుండా అన్ని పార్టీలు మే డే జరుపుకోవడం గొప్ప విషయం.దేశంలో నేడు మేడే అన్ని ప్రాంతాల్లో జరిగింది. అన్ని పార్టీలు ఇందులో పాల్గొన్నాయి. కార్మికుల ప్రయోజనాలు గురించి వారి సంక్షేమం గురించి నాయకులందరూ చెప్పకతప్పలేదు . సభలు ,సమావేశాలు ర్యాలీలు జరిగాయి. కార్మికవాడల్లో పండగ వాతావరణం నెలకొన్నది .

పనిగంటలు తగ్గింపుకోసం చికాగోనరంలో కార్మికులు చిందించిన రక్తం నుంచి పుట్టిన జెండా ఎర్రజెండా …అది కార్మికవర్గానికి రక్షణగా నిలిచింది…ప్రపంచంలోని కార్మికవర్గాన్ని ఏకం చేసింది. అంతకు ముందు 16 గంటలు , 18 గంటలు పనిచేయాల్సి ఉండేది . రెక్కలు ముక్కలు చేసుకొని అన్ని గంటలు పనిచేస్తున్న యాజమాన్యాలకు కార్మికులపై కనీసం జాలి దయ లేదు … మరిన్ని గంటలు పని చేయాలనీ వత్తిడి చేశారు . యాజమాన్యాల వత్తిడి కార్మికులను సంఘటితం చేసింది. 1886 లో చికాగో నగరంలో కార్మికులు పెద్ద ఎత్తున సమావేశం అయ్యారు . వారిపై పోలీసులు దాడులు చేశారు . చివరకు కాల్పులకు దారితీసింది.అక్కడ పోలీసులు జరిపిన కాల్పుల్లో కార్మికులు మరణించారు . మరణించిన కార్మికుల రక్తం నుంచే ఎర్రజెండా పుట్టింది. ప్రపంచ కార్మికులారా ఏకంకండి అని నినాదం ఇచ్చింది. యాజమాన్యాలు కార్మికశక్తికి తలొగ్గి పనిగంటలు తగ్గించడమే కాకుండా వారాంతపు శలవుల ప్రకటించారు .రెండుమూడు రోజుల పాటు చికాగోనగరంలో కార్మికులు పోలీసులకు మధ్య జరిగిన యుద్ధంలో మరణించిన కార్మికుల రక్తంలోనుంచి వెలసిందే ఎర్రజెండా… అది మే డే నాడు జరగడం తో నాటినుంచి మే డే ప్రపంచ కార్మికులు దినోత్సవంగా , మే డే ను జరుపుకుంటున్నారు .

మనదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు,వాటి కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున జరుపుకునేవి …కార్మికులు అంత మే డే ను తమ పండుగగా భావించి జరుపుకుంటున్నారు . అన్ని కార్మిక సంఘాలు ఈ మే డే కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. నాడు పనిగంటలు తగ్గింపుకోసం జరిగిన ఈ పోరాటం నేడు హక్కుల కోసం పని పద్ధతుల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా వేతనాలకోసం జరుపుకోవడం జరుగుతుంది. దానికి ఎర్రజెండా అండదంగా నిలుస్తుంది. కార్మికుడు అంటే ఎర్రజెండా , ఎర్రజెండా అంటే కార్మికుడు అనే స్థాయికి వెళ్ళింది. అందువల్లనే ప్రపంచం అంతటా మే డే వేడుకలు జరగడం అనయితిగా మారింది.

Related posts

ఇక షావోమీ చౌక కార్లు..! 2024లో విడుదల దిశగా ప్రయత్నాలు…

Drukpadam

రాహుల్ గాంధీ కేసును విచారించలేనన్న గుజరాత్ హైకోర్టు జడ్జి.

Drukpadam

టీటీడీ ఈవోగా ధర్మారెడ్డికి అర్హ‌త‌లున్నాయి: ఏపీ హైకోర్టు

Drukpadam

Leave a Comment