Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కన్ఫ్యూజన్ లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్!

కన్ఫ్యూజన్ లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్!
-పార్టీ పెట్టాలనే ఆలోచనను విరమించుకున్న ప్రశాంత్ కిషోర్
-ఏ పార్టీ లేదు.. ప్రస్తుతానికి పాదయాత్రే నా మార్గంమంటూ ప్రకటన
-జీరో నుంచి నా ప్రయాణం మొదలు
-3,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తా
-సాధ్యమైనంత మంది ప్రజలను కలుస్తా
-నితీశ్ కుమార్ తో ఘర్షణ లేదు

ఎన్నికల వ్యూహకర్తగా అనేక విజయాలు అందించిన ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం కన్ఫ్యూజన్ లో ఉన్నారా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు … ప్రస్తుతం ఆయన రాజకీయాలా ? ఎన్నికల వ్యూహాలా? అనేది తేల్చుకోలేకపోతున్నారు . గత కొంతకాలంగా ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా పని చేయనంటూనే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రతిపక్షాలు అన్ని కలిసి అంగీకరిస్తే తన వ్యూహకర్తగా పని చేస్తానని ప్రకటించారు. అంతకు ముందు పశ్చిమబెంగాల్ ఎన్నికలు అయిన తరువాత ఇక ఎన్నిక వ్యూహకర్తగా పనిచేయడంలేదని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ అన్నమాటపై నిలబడటం లేదనే  విమర్శలు ఉన్నాయి. తెలంగాణాలో కేసీఆర్ కు తన టీం ద్వారా ఎన్నిక వ్యూహాలు రచించే పనిలో పడ్డారు . కాంగ్రెస్ లో చేరాలనే ప్రయత్నాలు చేశారు . కాంగ్రెస్ అధినేత్రి సోనియా , రాహుల్ ,ప్రియాంక , ఇతర ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు . వారి మధ్య అంగీకారం కుదరక కాంగ్రెస్ కు దూరమైయ్యారు . తాను బీహార్ లో రాజకీయ పార్టీ పెడుతున్నట్లు తెలిపారు . తరువాత ఇప్పట్లో రాజకీయ పార్టీ పెట్టడం లేదని ప్రకటించడం ద్వారా ఆయన కన్ఫ్యూజన్ లో ఉన్నారా ? లేక వ్యూహాత్మకంగా ప్రజలను కంఫ్యూజ్చేస్తున్నారా ? అనేసందేహాలు కలుగుతున్నాయి.

తాను రాజకీయ పార్టీ పెట్టడం లేదంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) గురువారం ప్రకటించారు. కాకపోతే ఈ దిశగా ఆయన తన మార్గాన్ని నిర్మించుకుంటున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 2 నుంచి బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపడతానని పీకే ప్రకటించారు. సాధ్యమైనంత మంది ప్రజలను తన పాదయాత్ర ద్వారా చేరుకుంటానని చెప్పారు. దీన్ని కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నంగా అభివర్ణించారు.

బీహార్ లో ఇప్పట్లో ఎన్నికలు లేవంటూ, రాజకీయ పార్టీ అన్నది ప్రస్తుతానికి తన ప్రణాళికల్లో లేదని స్పష్టం చేశారు. ‘‘నేను జీరో నుంచి ప్రయాణం మొదలు పెట్టాలి. స్వరాజ్యం అనే ఆలోచనతో రానున్న మూడు నాలుగేళ్లలో సాధ్యమైనంత మంది ప్రజలను కలుసుకోవాలి’’ అంటూ తన భవిష్యత్ ప్రణాళికను పీకే చెప్పకుండానే చెప్పేశారు.

రాష్ట్రంలో ఏ పార్టీతోనూ కూటమి ఉండదని చెబుతూ.. ఆర్జేడీ, జేడీ యూ పార్టీలపై విమర్శలు చేశారు. గత 15 ఏళ్లలో బీహార్ కు ఒరిగిందేమీ లేదన్నారు. ‘‘ఈ రోజు ఏ రాజకీయ పార్టీని లేదా రాజకీయ వేదికను నేను ప్రకటించడం లేదు. బీహార్ ను మార్చాలనుకునే అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలని అనుకుంటున్నాను’’ అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో తనకు ఎటువంటి వ్యక్తిగత ఘర్షణ లేదన్నారు. ఇరువురి మధ్య మంచి సంబంధాలు ఉన్నట్టు చెప్పారు. వ్యక్తిగత సంబంధాలు వేరని, కలసి పనిచేయడం, అంగీకరించడం వేర్వేరు అని ప్రకటించారు.

Related posts

వ్యవసాయ చట్టాల రద్దుకోసం 27 న దేశ బంద్ ….అఖిల పక్షాలు…

Drukpadam

ముంబైలో తాగేందుకు నీళ్లు ఉండవా?: ఔరంగాబాద్ బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్…

Drukpadam

హిందీని నిర్బంధంగా అమలు చేస్తే దేశం మూడు ముక్కలౌతుంది…స్టాలిన్

Drukpadam

Leave a Comment