కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూటే సపరేటు …
-రాహుల్ సభకు దూరంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
-సాయంత్రం వరంగల్ లో రాహుల్ గాంధీ సభ
-వారం రోజులుగా కాంగ్రెస్ కీలక నేతలందరూ అక్కడే గడుపుతున్న వైనం
-అటువైపు కన్నెత్తి చూడని రాజగోపాల్ రెడ్డి
అధికారం ఉన్నన్నాళ్ళు దానివెంట పరుగులు పెడుతూ అది పోగానే దాన్ని విస్మరించడం నేతలారకు రివాజుగా మారింది. అన్ని పార్టీల్లో ఈ జాడ్యం కనిపిస్తుంది. ప్రత్యేకంగా కాంగ్రెస్ లో ఇది ఎక్కువ కనిపిస్తుంది. తెలంగాణ ఏర్పడిన తరవాత జరిగిన రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు అధికార టీఆర్ యస్ చేరడం పై కూడా విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ కేంద్రంలోను రాష్ట్రంలో అధికారం ఉన్న నాడు దానికి మేమె కర్త ,కర్మ ,క్రియ అన్న అనేకమంది నేతలు అధికారం మొగానే మొఖం చాటేశారు . అందరు దూరమైనా కోమటి రెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ కు ఉన్నారనుకుంటే వారికో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సభకు దూరం కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన రూటే సపరేటు అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు .
ఈరోజు వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సభకు రాహుల్ గాంధీ హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈ సభను విజయవంతం చేయాలనే పట్టుదలలో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నాయి. మరోవైపు ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రాహుల్ సభకు కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో రాహుల్ సభ జరుగుతోంది. సభ కోసం గత వారం రోజుల నుంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ హనుమకొండలో బిజీగా గడుపుతుండగా… రాజగోపాల్ రెడ్డి మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదు.
మరోవైపు, క్యారెక్టర్ లేని వారి వద్ద తాను పని చేయలేనని కొన్ని రోజుల క్రితం ఆయన వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి కూడా రాగోపాల్ రెడ్డి పార్టీతో అంటీముట్టనట్టే వ్యవహరిస్తున్నారు. ఇటీవల రాహుల్ గాంధీని కలిసేందుకు కాంగ్రెస్ కీలక నేతలందరూ ఢిల్లీకి వెళ్లారు. అప్పుడు కూడా ఆయన దూరంగానే ఉన్నారు.