Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పొంగులేటికి రాజ్యసభ పుకార్లు …అధిష్టానం నుంచి లేని సమాచారం!

పొంగులేటికి రాజ్యసభ పుకార్లు …అధిష్టానం నుంచి లేని సమాచారం!
-ఖమ్మంలో హడావుడి …నామినేషన్ తేదీలు సైతం వెల్లడి
-స్పందించని పొంగులేటి క్యాంపు కార్యాలయం
-టీఆర్ యస్ ముఖ్యనేతలను సైతం ఖంగు తినిపించిన వైనం

ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ యస్ ముఖ్య నాయకుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాజ్యసభ సీటు ఖరారు అయిందని మీడియా లో వార్తలు రావడం అది సోషల్ మీడియా లో వైరల్ కావడంతో ఒక్కసారిగా పొంగులేటి శిబిరంలో ఆనందం వ్యక్తం అయింది. అదే సందర్భంలో వైరి శిబిరాలను ఈ వార్త ఒక్కసారిగా ఖంగు తినిపించింది. ఒకరకంగా అసమ్మతినేతగా ముద్రపడిన పొంగులేటి రాజ్యసభ సీటు ఇస్తారా ? కేసీఆర్ ఇలాంటి నిర్యాణం తీసుకున్నారా ? అని టీఆర్ యస్ శ్రేణులు ఆరాతీశాయి. పొంగులేటి క్యాంపు కార్యాలయం నుంచి స్పందనలేదు . అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం లేదని టీఆర్ యస్ వర్గాలు సైతం పేర్కొన్నాయి.

ఖమ్మం లో మాత్రం హడావుడి మొదలైంది. ఆయన నామినేషన్ తేదీలను ఖరారు చేస్తూ సోషల్ మీడియా లో వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్త టీఆర్ యస్ ముఖ్యనేతలను సైతం ఖంగు తినిపించింది. వాస్తవంగా బండ ప్రకాష్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీ భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. నాటినుంచి ఈ స్థానాన్ని ఎవరికీ ఇస్తారు ? తిరిగి బీసీలకు ఇస్తారా ? లేక మరొకరితో భర్తీ చేస్తారా ? అనే సందేహాలు నెలకొన్నాయి. ఎవరికీ ఇచ్చిన కేసీఆర్ చివరి రోజువరకు సస్పెన్షన్ లో ఉంచుతారు కదా ? ముందే ప్రకటించారు కదా ? అనే సందేహాలు సైతం కలిగాయి .అయినప్పటికీ పొంగులేటి తోపాటు జిల్లాకు చెందిన హెట్రో డ్రగ్స్ అధినేత ప్రముఖ పారిశ్రామిక వేత్త బండి పార్థసారథి రెడ్డి , మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్లు సైతం ప్రచారంలోకి వచ్చాయి. 2018 ఎన్నికకు నాటి నుంచి జిల్లాకు చెందిన పొంగులేటికి , తుమ్మలకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు . జిల్లాలో టీఆర్ యస్ కు సీట్లు రాకపోవడానికి ఈ ఇద్దరు నేతలే కారణమని కేసీఆర్ అభిప్రాయం… దీన్ని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. అయితే తుమ్మల ఢిల్లీలో నామ నివాసంలో లంచ్ సందర్భంగా తుమ్మల కలిశారు . శ్రీనివాస్ రెడ్డి అక్కడికి వెళ్లిన సీఎం ను కలవలేదు . పొంగులేటి కేటీఆర్ తో ఇప్పటికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల నకిరేకల్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంట్లో జరిగిన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కాగా అక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం కలిశారు .ఇది సాధారణ కలయకే అయినా దీనిపై రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. శ్రీనివాస్ రెడ్డి రాజ్యసభ సీటు వరకు తీసుకెళ్లాయి. ఇప్పటికైతే సీఎం కేసీఆర్ తన మనసులో మాటను బయట పెట్టలేదు. బండ ప్రకాష్ ఖాళీ అయిన సీటుతో పాటు మరో మూడు సీట్లు త్వరలో తెలంగాణ నుంచి ఎన్నిక జరగాల్సి ఉంది. బండ ప్రకాష్ పదవి కాలం మరో రెండు మూడు సంవత్సరాలు మాత్రమే ఉంది. అందువల్ల సీఎం ఎవరిని ఎంపిక చేస్తారనే ఉత్కంఠ నెలకొన్నది ….చూద్దాం ఏమిజరుగుతుందో …

Related posts

ఎండాడ‌లోని వైసీపీ కార్యాల‌యానికి నోటీసులు!

Ram Narayana

ఈడీ అదుపులో అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రి సీఎండీ మణి!

Drukpadam

భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ జాగిలం రీనా మృతి…

Drukpadam

Leave a Comment