Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నాడు ఐటీ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యం నేడు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది : చంద్ర‌బాబు!

నాడు ఐటీ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యం నేడు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది : చంద్ర‌బాబు!
టెక్నాలజీ సరిగా ఉపయోగించుకున్నప్పుడే సరైన ఫలితాలు
ఆధునిక సాంకేతిక ఫ‌లాలు సామాన్యుడికి అందిన‌ప్పుడే వాటికి సార్థ‌క‌త‌ అన్న బాబు
టీడీపీ హ‌యాంలో ఐటీకి అధిక ప్రాధాన్యమిచ్చామని వ్యాఖ్య
సేవా కేంద్రాలు, ఆర్.టి.జి.ఎస్. కేంద్రాలు అందుకు నిదర్శనమని వెల్లడి

ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ రంగానికి త‌న‌ హ‌యాంలో ఇచ్చిన ప్రాధాన్యం కార‌ణంగా నేడు ల‌క్ష‌ల మంది జీవితాల్లో వెలుగులు నింపుతోందని టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు తెలిపారు. బుధవారం జాతీయ సాంకేతిక ప‌రిజ్ఞానం దినోత్స‌వాన్ని పురస్క‌రించుకుని ట్విట్ట‌ర్ వేదిక‌గా చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య చేశారు.

తెలుగుదేశం పాలనలో ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించడానికి ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను ఉపయోగించామ‌ని సంద‌ర్భంగా చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. నాటి సేవా కేంద్రాల నుంచి నిన్నటి ఆర్.టి.జి.ఎస్. కేంద్రం వరకు అందుకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయ‌ని తెలిపారు. తెలుగుదేశం పార్టీలోనూ అదే పధ్ధతి అవ‌లంబిస్తున్నామ‌ని కూడా చంద్ర‌బాబు పేర్కొన్నారు.

జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం సందర్భంగా మానవ జీవితాన్ని అత్యున్నతం, సులభతరం చేస్తోన్న శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు ఇతర సాంకేతిక నిపుణులందరికీ చంద్ర‌బాబు కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. ఆధునిక సాంకేతిక ఫలాలు సామాన్యుడికి సైతం ఉపయోగపడినప్పుడే వాటికి సార్ధకత అని తాను మొదటి నుంచి నమ్ముతాన‌ని సంద‌ర్భంగా చంద్రబాబు చెప్పారు.

Related posts

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా

Drukpadam

ఇప్పటికీ తేరుకోని మణిపూర్.. అస్తవ్యస్తంగానే జనజీవనం…

Drukpadam

అజయ్ మిశ్రా ను బర్తరఫ్ చేయాలి

Drukpadam

Leave a Comment