Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాపులంతా పవన్ పాట పడుతున్నారా ? ఇది అంబటి రాంబాబు అంగీకరిస్తున్నారా??

కాపులంతా పవన్ పాట పడుతున్నారా ? ఇది అంబటి రాంబాబు అంగీకరిస్తున్నారా??
-కాపులందరూ పవన్ పాటపాడుతుంటే.. ఆయనేమో చంద్రబాబు జపం చేస్తున్నారన్న ఏపీ మంత్రి అంబటి
-చంద్రబాబు వెంటనే సీఎం అయిపోవాలని అనుకుంటున్నారన్న అంబటి
-ప్రజలకు సేవ చేసి పీఎం అయినా మాకు అభ్యంతరం లేదన్న మంత్రి
-జగన్ సింహంలా సింగిల్ గానే ఎన్నికలకు వెళ్తారన్న అంబటి

కాపులంతా పవన్ , పవన్ అంటుంటే …ఆయనేమో చంద్రబాబు ,చంద్రబాబు అంటున్నారని ఏపీ భారీ నీటిపారుదల శాఖామంత్రి అంబటి రాంబాబు అంటున్నారు .ఇదే నిజమైతే మరి కాపుల్లో వైసీపీకి ఏమాత్రం పట్టులేదనే అనుకోవాల్సి వస్తుంది. అందుకు అంబటి రాంబాబు అంగీకరిస్తారా ?అంటే అంగీకరించకపోవచ్చు . ఎందుకంటే ఆయన మహా మాటకారి అదీగాక ఏ విషయాన్నీ అయినా ఇట్టే చెప్పగలరు .అందుకే అనుకోకుండా చేసిన వ్యాఖ్యలుగా అనుకోవాలా లేక నిజంగానే చేశారా ? అనేది ఆయనే చెప్పాలి . ఏపీ లో రాజకీయాలు ఎన్నికలకు రెండు సంత్సరాలకు ముందే హీటెక్కాయి. ఫలితంగా పార్టీలమధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో నిన్న నిర్వహించిన ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాపులందరూ పవన్, పవన్ అని అంటుంటే, ఆయనేమో చంద్రబాబు జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పనిలోపనిగా టీడీపీ అధినేత చంద్రబాబుపైనా విమర్శనాస్త్రాలు సంధించారు.

చంద్రబాబు తాను వెంటనే సీఎం కావాలని అనుకుంటున్నారని, అందుకనే క్విట్ జగన్ అని అంటున్నారని అన్నారు. చంద్రబాబు ప్రజలకు మేలు చేసి ప్రధానమంత్రి అయినా తమకు అభ్యంతరం లేదన్న అంబటి.. పవన్, సీపీఐ, బీజేపీ మెడలపై కూర్చుని అధికారంలోకి రావాలని ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జగన్ సింహంలా ఒంటరిగా ఎన్నికలకు సిద్ధమయ్యారని అన్నారు. తమ ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాల్లో ప్రజలకు రూ.1.39 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చిందని, రానున్న రెండేళ్లలో మరో లక్ష కోట్ల రూపాయలను అందిస్తుందని అంబటి వివరించారు.

Related posts

జగన్ తప్పుకుని సీఎం ప‌ద‌విని బీసీల‌కు ఇస్తారా?: య‌న‌మ‌ల

Drukpadam

సమీక్ష సమావేశంలో.. 32 మంది ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్!

Drukpadam

ఎన్టీఆర్ జిల్లా.. వైసీపీకి రాజకీయంగా లాభిస్తుందా?

Drukpadam

Leave a Comment