ప్రైవేట్ హాస్పిటల్స్ కు ధీటుగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో వైద్య సేవలు
-ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశం
-హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు , కలెక్టర్ వీపీ గౌతమ్
-ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సు దినోత్సవం పాల్గొన్న జడ్పీ చైర్మన్
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్య సేవలు అందజేస్తుంది అని, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు . అత్యన్నత సేవలను అందిస్తూ ఖమ్మానికి మంచి పేరు తెస్తున్న డాక్టర్లను ,సిబ్బందిని అభినందించారు . ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రభుత్వ ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈసందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఎన్నో మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగిందన్నారు . దాన్లో భాగంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి క్యాత్లాబ్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు . దాని ద్వారా లక్షల రూపాయలు ఖర్చయ్యే వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చేయడం జరుగుతుందని వైద్య శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా ఇటీవల ప్రారంభించడం జరిగిందని చెప్పారు . , ఇటీవల మిల్క్ బ్యాంకును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదగా ప్రారంభించడం జరిగిందన్నారు , అదేవిధంగా ఆక్సిజన్ ప్లాంట్ మరెన్నో సేవలు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఏర్పాటు చేసుకోవడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ అని అన్నారు,అనంతరం అంతర్జాతీయ నర్స్ దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలోని నర్సుల తొ కలిసి కేక్ కట్ చేసి వారికి తినిపించారు వారి సేవలను అభినందించారు, అనంతరం ఆస్పత్రిలో ఉన్న వారిని పరామర్శించిన కమల్ రాజ్ వసతులను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో డిఎంఅండ్హెచ్ఓ మాలతి, సూపర్డెంట్ వెంకటేశ్వర్లు,ఆర్ ఎం ఓ బోల్లి కొండ శ్రీనివాస్ హాస్పటల్ డెవలప్ కమిటీ మెంబర్స్ డాక్టర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.