Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

కేరళలో కీచక టీచర్ …60 మందిపై అఘాయిత్యం

కేరళలోని మలప్పురం గర్ల్స్ స్కూల్లో ఘోరం

టీచర్ రిటైర్ కావడంతో నోరు విప్పిన విద్యార్థులు

50 మందికి పైగా కలసి పోలీసులకు ఫిర్యాదు

విచారణకు ఆదేశించిన విద్యా మంత్రి

కేరళలో ఓ కీచక మాజీ ఉపాధ్యాయుడి ఘోరాలు వెలుగు చూశాయి. 38 ఏళ్ల సర్వీసులో ఆయన 60 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్టు విషయం బయటకు వచ్చింది. మలప్పురం మున్సిపాలిటీలో సీపీఎం కౌన్సిలర్ గా ఉన్న కేవీ శశికుమార్.. పట్టణంలోని సేంట్ గెమాస్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో టీచర్ గా పనిచేసి 2022 మార్చిలో రిటైర్ అయ్యాడు.

ఉపాధ్యాయుడిగా పనిచేసిన సమయంలో వేధింపులకు గురి చేసినట్టు శశికుమార్ కు వ్యతిరేకంగా పోలీసు కేసు నమోదైంది. 50 మందికి పైగా కలసి ఫిర్యాదు చేశారు. మూడు పర్యాయాలు కౌన్సిలర్ గా పనిచేస్తుండడంతో రాజకీయ పలుకుబడిని అతడు తనకు రక్షణగా ఉపయోగించుకున్నాడు. దాంతో అతడి అఘాయిత్యాలపై ఎవరూ ధైర్యం చేసి చెప్పలేకపోయారు. శశికుమార్ రిటైర్ అయ్యాడని ఫేస్ బుక్ ద్వారా తెలుసుకున్న మాజీ విద్యార్థిని ఒకరు అతడి లీలలను బయటపెట్టింది.

ఆరోపణలు రావడంతో వారం రోజులుగా పరారీలో ఉన్న శశికుమార్ ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి విచారణకు ఆదేశించారు. స్కూల్ యాజమాన్యం తరఫున లోపాలు ఉన్నాయేమో చూడాలని కోరారు. ఈ పరిణామాలతో శివకుమార్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు సీపీఎం ప్రకటించింది. మున్సిపల్ కౌన్సిలర్ పదవికి అతడు రాజీనామా చేశాడు.

Related posts

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపు

Ram Narayana

అమెరికాలో గన్ కల్చర్ …పాఠశాలలో విద్యార్థులు మధ్య ఘర్షణ కాల్పులు…

Drukpadam

పోలీసు దిగ్బంధంలో అమలాపురం.. పట్టణంలోకి వచ్చే అన్ని దారుల మూసివేత!

Drukpadam

Leave a Comment