Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చింత‌న్ శిబిర్‌లో క‌ట్టిప‌డేసే ఫొటోలు !

చింత‌న్ శిబిర్‌లో క‌ట్టిప‌డేసే ఫొటోలు !

  • ఉద‌య్ పూర్ వేదిక‌గా మూడు రోజుల స‌ద‌స్సు
  • పాత మిత్రుల‌తో కాంగ్రెస్ నేత‌ల భేటీలు
  • వైర‌ల్‌గా మారిన‌ ప్రియాంక‌తో సీత‌క్క ఫొటో
రాజ‌స్థాన్‌లోని ఉద‌య్ పూర్ వేదిక‌గా కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల పాటు నిర్వ‌హిస్తున్న న‌వ సంక‌ల్ప్ చింత‌న్ శిబిర్‌లో ఆ పార్టీ నేత‌లు ఉల్లాసంగా, ఉత్సాహంగా క‌నిపిస్తున్నారు. శుక్ర‌వారం స‌ద‌స్సు ప్రారంభం కాగానే… పార్టీ అధినేత్రి హోదాలో సోనియా గాంధీ ప్రారంభోప‌న్యాసం చేయ‌గానే… నేత‌లంతా గ్రూప్ డిస్క‌ష‌న్స్‌లోకి వెళ్లిపోయారు. రెండో రోజైన శ‌నివారం కూడా నాన్ స్టాప్‌గా గ్రూప్ డిస్క‌ష‌న్లు జ‌రుగుతున్నాయి.
ఈ సంద‌ర్భంగా అన్ని రాష్ట్రాల‌కు చెందిన నేత‌లంతా ఒకే చోట క‌ల‌వ‌డంతో ఆయా నేత‌లు త‌మ మిత్రుల‌తో క‌లుస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఫొటోలు జ‌నాల‌ను క‌ట్టి ప‌డేస్తున్నాయి. తెలంగాణ‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క… పార్టీ అగ్ర నేత ప్రియాంకా గాంధీతో క‌లిసి దిగిన ఫొటో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఇలాంటి క‌ట్టిప‌డేసే ఫొటోలు చింత‌న్ శిబిర్‌లో చాలానే క‌నిపించాయి.

Related posts

మోదీ ప్రధాని అయ్యింది ఉల్లిపాయల ధరలు తగ్గించడానికి కాదు!: కేంద్ర మంత్రి పాటిల్

Drukpadam

ఇంతవరకు ఇలా ఏ ప్రధాని మాట్లాడలేదు: మంత్రి కేటీఆర్

Drukpadam

18 ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు వీరే!

Drukpadam

Leave a Comment