కిరణ్ కుమార్ రెడ్డి చుట్టూ ఏపీ కాంగ్రెస్ రాజకీయాలు …
-మాజీ లంతా కనుమరుగు …కాంగ్రెస్ ను రక్షించే వాడికోసం వెతుకులాట
-ఏపీ లో కాంగ్రెస్ భాద్యతలు నెత్తికి ఎత్తుకోవడానికి సిద్ధంగా లేని కిరణ్ కుమార్ రెడ్డి …
-ఢిల్లీ రావాలని కాంగ్రెస్ అధిష్టానం పిలిచిందంటు వార్తలు
-ఎలాంటి పిలుపు రాలేదంటున్న కిరణ్ కుమార్ అనుయాయుల
-గతంలోనే పీసీసీ చీఫ్ పదవి ని తిరస్కరించిన కిరణ్ కుమార్
-ఏపీ లో కాంగ్రెస్ అంటేనే భయపడుతున్న నేతలు
-రాష్ట్ర విభజనతో డ్యామేజ్ …రిపేర్ చేయాలేనంతగా ఉన్న పరిస్థితి
ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చుట్టూ ఏపీ కాంగ్రెస్ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఏపీ లో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని విధంగా డ్యామేజ్ అయింది. దాన్ని రిపేర్ చేసే బాధ్యతలు నెత్తికెత్తుకొమ్మని ఏఐసీసీ కిరణ్ కుమార్ రెడ్డిని కోరుతుంది. అందుకు ఆయన సునాముఖంగా లేరు . అందువల్ల ఆయన్ను ఒప్పించేందుకు అధిష్టానం ఢిల్లీ పిలిచింది వార్తలు వచ్చాయి. అలాంటి పిలుపు ఏమి లేదని వచ్చిన ఆయన అందుకు సుముఖంగా లేయారని ఆయన సన్నిహితులు అంటున్నట్లు మరో వార్త సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతోంది. ఏది ఏమైనా ఏపీ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు .ఇది ఎవరు కాదనలేని సత్యం .అందువల్ల కిరణ్ కుమార్ కాదు కదా , మరో నేత వచ్చిన ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకోవడం కష్టం అంటున్నారు .
కిరణ్‌కుమార్ రెడ్డికి పీసీసీ చీఫ్ లాంటి పదవిని అప్పగించే అవకాశం ఉందని ప్రచారం కూడ లేకపోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కూడ ఆయనకు సూచించారని కిరణ్ సన్నిహితుల్లో అప్పట్లో ప్రచారంలో ఉంది.అయితే కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి చేరలేదు.
ఆ తర్వాత 2019 నవంబర్ 21న కూడా కిరణ్ కుమార్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై కూడా స్పష్టత ఇచ్చారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారంపై కూడా ఆయన స్పందించారు.
తనకు PCC చీఫ్ పదవిపై అంతగా ఆసక్తి లేదని తేల్చి చెప్పేశారు. ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే ఎందో భాదేస్తుందన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించానని గుర్తు చేశారు.
ఈ పరిణామాలు చూసి తనకు రాజకీయాలపట్ల అసంతృప్తి కలిగిందన్నారు. ఇకపోతే ఏపీ పీసీసీ చీఫ్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ఒట్టిదేనని కూడా ఆయన తేల్చి చెప్పారు.