Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాజ్యసభ సీటు …జరుగుతున్న చర్చ…

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాజ్యసభ సీటుజరుగుతున్న చర్చ
అధిష్టానం మైండ్ గేమ్అంతు పట్టని శ్రీనివాస్ రెడ్డి అంతరంగం
సీటు ఇస్తామంటే శ్రీనివాస్ రెడ్డి తిరస్కరించారా…?
టీఆర్ యస్ లో అసలేం జరుగుతుంది

టీఆర్ యస్ నాయకుడు మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డికి రాజ్యసభ సీటుపై పార్టీ బాస్ నుంచి ఎలాంటి సంకేతాలు ఉన్నాయి. అనేదానిపై గత కొంతకాలంగా ఆశక్తికర చర్చ జరుగుతుంది. .. సిట్టింగ్ ఎంపీ గా ఉన్న ఆయనకు ఎన్నికల్లో సీటు ఇవ్వలేదు … కొన్ని అనివార్య పరిస్థితులవల్ల సీటు ఇవ్వలేక పోతున్నామని చెప్పి …ఎన్నికల్లో సీటు ఇవ్వకపోయినా రాజ్యసభ ఇస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారు . కేసీఆర్ చెప్పిన తరవాత తనకు రాజ్యసభ గ్యారంటీ అనుకున్నారు . కానీ అదికూడా రాలేదు . మూడు సంత్సరాలు గడిచింది. అయినప్పటికీ పార్టీని అంటి పెట్టుకొను ఉంటున్నారు . సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నా , అసలు అపాయింట్ మెంట్ ఇవ్వకపోయినా ఇతర పార్టీలనుంచి ఆఫర్లు ఉన్నా పార్టీ తోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు . 2019 ఎన్నికల్లో టీఆర్ యస్ నుంచి లోకసభ టికెట్ రాకపోతే కాంగ్రెస్ ఖమ్మం టికెట్ ఆఫర్ చేసినప్పటికీ ఆయన అందుకు నిరాకరించారు . పార్టీ అధినేత దూరం పెట్టినప్పటికీ కేటీఆర్ పై విశ్వాసం ఉందని పలుమార్లు చెపుతుంటారు . అలాగే కేటీఆర్ సైతం పొంగులేటి పట్ల సానుకూల వైఖరితో ఉండటం తో తిరిగి రాజ్యసభ సీట్లు ఖాళీ కావడం వల్ల పొంగులేటి పేరు ప్రస్తావనకు వచ్చింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాజ్యసభ ఇస్తున్నారని అదికూడా బండ ప్రకాష్ రాజీనామా చేసిన రెండు సంవత్సరాలు కాలం మాత్రమే మిగిలి ఉన్న సీటు ఇస్తారని ప్రచారం జరిగింది. తరవాత కేసీఆర్ ను కలవబోతున్నారని వార్తలు వచ్చాయి….లేదు లేదు ….కేసీఆర్ కాదు …కేటీఆర్ ను కలిశారని సమాచారం వచ్చింది. …పొంగులేటి కేటీఆర్ ను కలిసిన మాట నిజం … కానీ అందులో రాజ్యసభ సీటు చర్చకు వచ్చినప్పటికీ కచ్చితమైన ప్రస్తావన గానీ నిర్ణయం గానీ జరగలేదని సమాచారం .. …

ఒక పక్క సీఎం కేసీఆర్ పొంగులేటిని కలిసేందుకు అంగీకరించారా? లేక ఆయన పార్టీ లో ఉన్న ఒకటే పోయిన ఒకటే అని అనుకుంటున్నారా ? కేటీఆర్ ను కలవడం …కేసీఆర్ గుర్రుగా ఉండటం దేనికి సంకేతం … రాజ్యసభ ఇస్తామంటే పొంగులేటి తిరస్కరించినట్లుగా కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజంగా టీఆర్ యస్ సీటు ఇస్తామంటే శ్రీనివాస్ రెడ్డి తిరస్కరిస్తున్నారా? ఆయన అంతరంగం ఏమిటి ? అనేది కూడా ఆశక్తిగా మారింది. పొంగులేటి తో టీఆర్ యస్ మ్యాండ్ గేమ్ ఆడుతుందా ? లేక పొంగులేటి పార్టీని వీడేందుకు టీఆర్ యస్ తో గేమ్ ఆడుతున్నారా ? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. టీఆర్ యస్ లో అసలు ఏమి జరుగుతుందనేది పార్టీలోని నేతలకే అర్థకావడంలేదని అంటుండటం గమనార్హం ….

Related posts

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం :13 జిల్లాల జడ్పీ ల కైవశం అదే రీతిలో ఎంపీపీ లు!

Drukpadam

కేసీఆర్ తరచుగా ప్రశాంత్ కిశోర్ తో కలుస్తున్నారు: రఘునందన్ రావు

Drukpadam

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేకు షాక్.. కేసీఆర్ పర్యటనలో ఘోర అవమానం!

Drukpadam

Leave a Comment