Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పంజాబ్ రైతులకు సీఎం కేసీఆర్ సహాయంపై విమర్శలు!

తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచ‌డానికి మీ తాత జాగీరా దొరా?: ష‌ర్మిల‌!
తెలంగాణ రైతులను ఆదుకోవడానికి డబ్బులు లేవా అని ష‌ర్మిల నిల‌దీత‌
రైతుల పంటలు కొనడానికి, సర్పంచులకు బిల్లులు చెల్లించడానికి లేవా అని విమ‌ర్శ‌
దేశాన్నేలడానికి పోవాలన్న దురదకు తెలంగాణ బిడ్డల ముంచకు దొరా అంటూ ట్వీట్

పంజాబ్ రైతులకు సహాయంపై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. మీ స్వంత డబ్బులు ఇస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు . కానీ రాష్ట్రప్రజలకు చెందాల్సిన సొమ్మును ఇతర రాష్ట్రాలకు పంచడం ఏమిటనే విమర్శలు ఉన్నాయి. కేసీఆర్ దేశ పర్యటనలో భాగంగా నేడు చండీఘడ్ పర్యటన చేస్తున్నారు . అక్కడ ప్రత్యేకంగా ఢిల్లీ లో మూడు నల్ల చట్టాల రద్దు కోసం జరిగిన ఆందోళనలో పాల్గొని మరణించిన రైతులకు సహాయం చేసేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు . అందులో ఆయన సొంత డబ్బులు అయితే ఎవరికీ అభ్యంతరం లేదు . కానీ ప్రభుత్వ ఖజానా నుంచి వేరే రాష్ట్రాలకు పంచడం ఏమిటనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేడు పంజాబ్ లో ప‌ర్య‌టించి రైతుల కుటుంబాల‌కు సాయం చేయ‌నున్న విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించిన వైఎస్సార్ టీపీ అధినేత్రి ష‌ర్మిల తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

”తెలంగాణ రైతులను ఆదుకోవడానికి, రైతుల పంటలు కొనడానికి, సర్పంచులకు బిల్లులు చెల్లించడానికి, విద్యార్థులకు ఫీజులు కట్టడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి పైసల్ రావు కానీ తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచనీకి మీ తాత జాగీరా దొరా?

పంట దిగుబడి లేక, పెట్టుబడి రాక మీరు ఆదుకొంటారనే ఆశ చచ్చి సిద్ధిపేట రైతు మల్లేశం ఆత్మహత్య చేసుకొన్నాడు. 11 లక్షల అప్పు తెచ్చి పంచాయతీ పనులు చేస్తే చేసిన పనులకు బిల్లులు రాక తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సర్పంచ్ ఎల్లయ్య చావడానికి ప్రయత్నించిండు. దేశాన్నేలపోవాలన్న మీ దురదకు తెలంగాణ బిడ్డల ముంచకు దొరా” అని ష‌ర్మిల ట్వీట్ చేశారు.

Related posts

ఏపీ కొత్త గవర్నర్ నియామకంపై తృణమూల్ ఎంపీ మహువా విమర్శలు!

Drukpadam

ఎంపీ ఫైజల్ పై అనర్హత వేటును ఎత్తివేసిన లోక్ సభ!

Drukpadam

సత్యవతి రాథోడ్ మాటలకూ వైయస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ….

Drukpadam

Leave a Comment