Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పెద్దల సభకు …బండి పార్థసారథి రెడ్డి , దామోదర్ రావు నామినేషన్ …ఎన్నిక లాంఛనమే !

రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్‌లు దాఖలు చేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు

  • నామినేషన్ వేసిన దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి
  • అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పత్రాల అందజేత
  • హాజరైన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
TRS Rajya Sabha candidates files nomination

రాజ్యసభ ఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థులు దీవకొండ దామోదర్ రావు, బండి పార్థసారథి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభకు స్థానాలకు నేడు పార్టీ తరపున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు . వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త బండి పార్థసారథి రెడ్డి కాగా మరొకరు కేసీఆర్ దగ్గర బంధువు దామోదర్ రావు లు ఉన్నారు . 6 సంవత్సరాల పదవి కాలానికి వీరు నామినేషన్ వేయగా పోటీలేక పోవడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు . ఇప్పటివరకు వీరికి ఎలాంటి రాజకీయ అనుభవం ఇంతవరకు లేదు . వారి సేవలకు గుర్తింపుగా రాజ్యసభ కు ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ వీరు ఎంపిక పై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కరోనా కష్టకాలంలో బండి పార్థసారథి రెడ్డి రెమిడీసీవీర్ ఇంజక్షన్ లు తయారు చేసి అనేక మంది ప్రాణాలు కాపాడినందున అప్పటి నుంచే కేసీఆర్ కు లుక్స్ లో ఉన్నారు . అయితే ఈయనపై విమర్శలు కూడా ఉన్నాయి .రెమిడీసీవీర్ ఇంజక్షన్లు బ్లాక్ న అమ్ముకున్నారని కోట్లాది రూపాయలు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల సందర్భంగా కూడా ఈయన పేరు ప్రచారం లోకి వచ్చింది. అప్పుడు కె ఆర్ సురేష్ రెడ్డిని కేసీఆర్ నిర్ణయించి కె. కేశవరావు తో పాటు పంపించారు . అయితే ఈయనపై మరో కథనం కూడా ఉంది. కేసీఆర్ కు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి మంచి సంబంధాలు ఉన్నందున జగన్ కోరిక మేరకు బండి పార్థసారథి రెడ్డికి కేసీఆర్ అవకాశం కల్పించారని మరో ప్రచారం జరుగుతుంది. బీసీ సంఘ నేత ఆర్ .కృష్ణయ్య ను ఏపీ నుంచి కేసీఆర్ రికమండ్ చేశారని అందువల్ల పరస్పరం ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో రాజ్యసభకు పంపారని గుసగుస లు వినిపిస్తున్నాయి. ఇక డి .దామోదరరావు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడే కాకుండా దగ్గర బంధువు అయినందున రాజ్యసభ సీటు ఇచ్చారని విమర్శలు ఉన్నాయి. తెలంగాణ నుంచి ఈ ఇద్దరితో పాటు బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయినా రెండు సంవత్సరాల పదవి కాలానికి ఖమ్మం కు చెందిన గాయత్రీ గ్రానైట్ అధినేత రవి కి అవకాశం కలిపించారు .మొత్తం   మీద పెద్దల సభకు రాష్ట్రం  నుంచి వెళుతున్న ముగ్గురు సభ్యులతో టీఆర్ యస్ సభ్యుల సంఖ్య పెరగనుంది .

Related posts

అత్యాచార బాధితురాలి స‌మ‌క్షంలోనే వాదులాడుకున్న‌ చంద్ర‌బాబు, వాసిరెడ్డి ప‌ద్మ

Drukpadam

టీఆర్ఎస్సా?, బీఆర్ఎస్సా?.. మునుగోడు బైపోల్‌లో గులాబీ అభ్య‌ర్థి పార్టీ పేరుపై డైల‌మా!

Drukpadam

ఈటెల హత్యకు కుట్ర …నాభర్తకు ఏమైనా జరిగితే కేసీఆరే భాద్యత వహించాలి …జమున

Drukpadam

Leave a Comment