Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అందులో నిజం లేదు …టీడీపీ లో చేరిక పై మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందన!

అందులో నిజం లేదు …టీడీపీ లో చేరిక పై మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందన!
టీడీపీలో చేరబోతున్నారనే వార్తలు  వాస్తవం కాదు..    కాదు …
లక్ష్మీనారాయణ టీడీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం
చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందంటూ వార్తలు
ఈ వార్తల్లో నిజం లేదన్న లక్ష్మీనారాయణ

జెడి లక్ష్మి నారాయణ ఐపీఎస్ అధికారి …తెలుగు రాష్ట్రాల్లో ఈయన పేరు తెలియని వారు ఉండరు …జగన్ పై సిబిఐ దాడుల సందర్భంగా సిబిఐ జాయింట్ డైరక్టర్ గా పని చేశారు … జగన్ లావాదేవీలపై ప్రతిరోజూ ఎదో ఒక న్యూస్ లో ఈయనపేరు బాగా వినపడేది …తరవాత మహారాష్ట్ర క్యాడర్ అధికారి అయినా జెడి పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు . పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన లో చేరి ఎంపీ గా పోటీచేసి ఓడిపోయారు . తరవాత సామజిక కార్యకర్తగా పనిచేస్తున్నారు . తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో టీడీపీ లో చేరబోతున్నారంటూ వస్తున్నా వార్తలు ఆయన కొట్టి పారేశారు . అందులో నిజం లేదని కొండబద్దలు కొట్టారు .

సీబీఐ మాజీ అధికారి వీవీ లక్ష్మీనారాయణ (జేడీ) టీడీపీ వైపు చూస్తున్నారంటూ వార్తలు ప్రచారమవుతున్నాయి. ఆయన టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలను లక్ష్మీనారాయణ ఖండించారు. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ టీడీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారని… జనసేనకు దూరంగా ఉంటున్న జేడీ టీడీపీలోకి జంప్ కానున్నారని… చంద్రబాబు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో టీడీపీలో చేరిక లాంఛనమే అని ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని చెప్పారు. ఇలాంటి వార్తల కోసం మనం విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని అన్నారు.

Related posts

బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో మమతా పార్టీ జోరు, రెండో స్థానంలో బీజేపీ!

Drukpadam

జాంనగర్ నియోజకవర్గంలో మరదలిపై వదిన ఆరోపణలు !

Drukpadam

సిసోడియాకు ఓ రూలు.. జగన్‌కు మరో రూలా?: సీపీఐ రామకృష్ణ..

Drukpadam

Leave a Comment