Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మాజీ సీఎం యడియూరప్పకు బీజేపీ షాక్..

  • మాజీ సీఎం యడియూరప్పకు బీజేపీ షాక్..
    -కుమారుడు విజయేంద్రకు ఎమ్మెల్సీ టికెట్ నిరాకరణ
    -పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడిగా ఉన్న విజయేంద్ర
    -ఆయన పేరును కోర్ కమిటీ ఏకగ్రీవంగా సిఫార్సు చేసినా పట్టించుకోని అధిష్ఠానం
    -ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఏడుగురు ఉండడంతో ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం

బీజేపీలో వారసత్వ రాజకీయాలకు తావు లేదని బీజేపీ మరోమారు తేల్చి చెప్పింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప చిన్నకుమారుడు విజయేంద్రకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. యడియూరప్ప ప్రస్తుతం షిమోగా (శివమొగ్గ) జిల్లా నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆయన పెద్ద కుమారుడు బీవై రాఘవేంద్ర షిమోగా నుంచి లోక్‌సభకు ప్రాతనిధ్యం వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో చిన్నకుమారుడైన విజయేంద్రకు యడియూరప్ప ఎమ్మెల్సీ టికెట్ ఆశించారు. ఆయన ప్రస్తుతం పార్టీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. విజయేంద్ర పేరును ఎమ్మెల్సీ టికెట్‌ కోసం పార్టీ కోర్‌ కమిటీ ఏకగీవ్రంగా సిఫార్సు చేసింది. అయినప్పటికీ అధిష్ఠానం ఈ ప్రతిపాదనను పక్కన పెట్టింది. శాసనమండలిలో ఏడు స్థానాలు ఖాళీ అవుతుండగా నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం బీజేపీ నలుగురు అభ్యర్థులను, జేడీఎస్ ఒక అభ్యర్థి పేరును ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ సోమవారం రాత్రే ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. ఏడు స్థానాలకు ఏడుగురు అభ్యర్థులే బరిలో ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.

Related posts

బాధితురాలి వీడియోలు ఫోటోలు బయట పెట్టడంపై రఘునందన్ రావు పై కాంగ్రెస్ ,టీఆర్ యస్ మండిపాటు …

Drukpadam

పీకే రాహుల్ పై ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.యూ టర్న్ కు కారణం ఏమిటి ?

Drukpadam

రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు అడగలేదన్న సత్యకుమార్ ….ఆగ్రహం వ్యక్తం చేసిన షాకవత్!

Drukpadam

Leave a Comment